Gold Rate Today: మే 3, శనివారం బంగారం ధరలు ఇవే...భారీగా తగ్గిన బంగారం ధర..
Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త..తగ్గిన బంగారం ధర..మే 15వ తేదీ బంగారం ధరలు ఇవే
Gold Rate Today: మే మూడో తేదీ శనివారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95600, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87950, ఒక కేజీ వెండి ధర రూ. 97100 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి అయినా ఒక లక్ష రూపాయల నుంచి నెమ్మదిగా తగ్గుతున్నాయి.
బంగారం ధరలు తగ్గుతున్న ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి స్వల్పంగా ఊరట లభించింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి కన్నా ప్రస్తుతం 6000 రూపాయల తక్కువగా ధర పలుకుతోంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా డాలర్ బలపడటం ఒక కారణంగా చెబుతున్నారు. ఎందుకంటే డాలర్ బలహీనమైన కొద్దీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు పెడుతుంటారు. కానీ డాలర్ పుంజుకుంటే క్యాష్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తారు. అలాగే స్టాక్ మార్కెట్లలో కూడా లాభాలు పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి.
ఎందుకంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి బంగారంలో పెట్టిన డబ్బును ఇన్వెస్టర్లు విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. పసిడి డిమాండ్ తగ్గే కొద్దీ దాని ధర కూడా తగ్గుతుంది. గతంలో చైనా సెంట్రల్ బ్యాంకు విపరీతంగా బంగారం కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడం తగ్గించాయి. దీంతో బంగారం ధర తగ్గింది. అలాగే బంగారంలో ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వారు లాభాలు బుక్ చేసుకుంటున్నారు.
ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. మొత్తానికి బంగారం ధరలు భారీ స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు ట్రేడ్ వార్ పైన ఆధారపడి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ అమెరికా చైనా ట్రేడ్ వార్ కొనసాగించినట్లయితే బంగారం ధరలు రికార్డు స్థాయిని తాకుతాయని. లేకపోతే నెమ్మదిగా తగ్గుతాయని పేర్కొంటున్నారు.