Gold Rate Today: అమాంతం తగ్గిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Update: 2025-03-02 03:30 GMT

Gold Rate Today: అమాంతం తగ్గిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. వరుసగా నాలుగో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. నేడు మార్చి 2వ తేదీ ఆదివారం బంగారం ధర రూ. 220 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి.

హైదరాబాద్, విజయవాడలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరరూ. 79,400 దగ్గర ఉండగా 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద ఉంది. నిన్న రూ. 500, రూ. 540 తగ్గిన బంగారం ధఱ ఈ రోజు రూ. 200 తగ్గింది. ఇవే ధరలు గుంటూరు, బెంగళూరు, ముంబైలో కూడా కొనసాగుతున్నాయి. చెన్నైలో కూడా పసిడి ధరలు వరుసగా రూ. 200, రూ. 200 మేర తగ్గింది. దీంతో అక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,400 దగ్గర, 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,620 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని నగరంలో బంగారం ధరలు రూ. 79, 550, రూ. 86,770 దగ్గర ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, 220 తక్కువగా ఉంది. అంతేకాదు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఢిల్లీలో బంగారం ధర ఎక్కువగానే ఉంది. బంగారం ధరలు తగ్గినప్పటికీ.. వెండి ధరలు నేడు స్థిరంగానే ఉన్నాయి. దీంతో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,05,000కు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండ ధరలు ఒకే విధంగా ఉన్నాయి. ఢిల్లీలో మాత్రం కిలో వెండి ధర రూ. 97,000 దగ్గర ఉంది.

Tags:    

Similar News