Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే
Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: 2025లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులకు కొనలేనంతగా పెరిగిపోయాయి. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో చూస్తే స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం ధర విపరీతంగా పెరిగింది. ఏప్రిల్ మొదటి వారంలో ఏకంగా లక్ష రూపాయల వరకు చేరుకుంది. బంగారం కొనాలనుకునేవారు పేద, మధ్య తరగతి వారికి షాకిచ్చింది. అయితే భారత, పాకిస్తాన్ యుద్ధం సమయంలో బంగారం ధరలు మాత్రం కాస్త తగ్గాయి. 24క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయల నుంచి 96వేలకు చేరుకుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ పెరుగుతూ వస్తోంది. 98వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక నిన్నటితో పోల్చితే ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్ లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89, 200 ఉండగా పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 97, 310గాఉంది. 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర రూ. 72, 990గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల బంగారంపై గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయల వరకు తగ్గింది. 10గ్రాముల 24క్యారెట్ల పసిడి ధర రూ. 97, 300 ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 89, 190 రూపాయలు, 10 గ్రాముల 18 క్యారెట్ల పసిడి ధర 72,980గా ఉంది.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా ప్రతిరోజూ ఎంతోకొంత తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్ లో కిలో వెండి ధర 11,090దగ్గర ట్రేడ్ అయ్యింది. కిలో వెండిపై 100 రూపాయలు తగ్గింది. వంద గ్రాముల వెండి ధర నేడు 1,10,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర 1,10,800 దగ్గర ట్రేడ్ అవుతోంది.