Gold Rate Today: బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన బంగారం ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Update: 2025-02-02 02:05 GMT

Gold Rate Today: కేంద్రంలోని మోదీ సర్కార్ ఫిబ్రవరి 1వ తేదీన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే బడ్జెట్ తర్వాత బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి. ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఎంత ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. తమ దగ్గర ఎంతో కొంత బంగారం ఉండాలని భావిస్తారు. మహిళలు ఆభరణాలు ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.దీంతో ఇటీవల బంగారంపై పెట్టుబడులు కూడా భారీగానే పెరిగాయి. దేశీయంగా కొనుగోళ్లు ఏడాది పొడవునా జరుగుతుంటాయి. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈమధ్య కాలంలో బంగారం ధరలు రికార్డ్ గరిష్టాలను చేరుకున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం శనివారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కీలక రంగాలపై ఊతం ఇచ్చే కేటాయింపులు చేసింది. కీలక నిర్ణయాలను ప్రకటించింది. ఈ క్రమంలో బంగారం ధర తగ్గించేందుకు కీలక నిర్ణయాలు ఉంటాయని దేశ ప్రజలు భావించారు. మరి బడ్జెట్ తర్వాత బంగారం ధర తగ్గిందా..ఫిబ్రవరి 2వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. బడ్జెట్ తర్వాత బంగార ధర తగ్గుతుందని భావించారు. బంగారం ధర తగ్గించేందుకు ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. దీంతో నేడు 22 క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు రూ. 150 పెరిగి రూ. 77, 450 వద్దకు చేరింది. 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర తులంపై రూ. 160 పెరిగి రూ. 84,490కి చేరుకుంది.

ఇక కేంద్ర బడ్జెట్ కు ముందు వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు కాస్త తగ్గాయి. బడ్జెట్ తర్వాత రోజు నేడు వెండి ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర నేడు రూ. 1,07,000వద్ద కొనసాగుతోంది. 

Tags:    

Similar News