Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..ఎంతంటే?
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..ఎంతంటే?
Gold Rate Today: గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పడుతుండటంతో దేశీయంగా కూడా ధరలు దిగివచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ. 800 దిగివచ్చింది. దీంతో 98, 500గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది.
అలాగే 99. 5 శాతం స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ. 800 దిగివచ్చింది. దీంతో 98వేలుగా నమోదు అయ్యింది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా దిగివచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో కిలో వెండి ధర రూ. 1,370 తగ్గి రూ. 99వేలుగా నమోదు అయ్యింది. ఔన్స్ బంగారం ధర 45 డాలర్లు తగ్గింది. దీంతో 3,296.92 డాలర్లుగా నమోదు అయ్యింది.