Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్..ఒక్కరోజే రూ. 1,150 తగ్గిన బంగారం ధర
Gold Rate Today: మహిళలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా బలహీన ధోరణులు నెలకొనడంతో దేశీయ బులియన్ మార్కెట్లో గురువారం దేశ రాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్చత గల బంగారం ధర తులం రూ.1,150 పతనమై రూ. 88, 200లకు చేరింది. 99.5శాతం స్వచ్చత గల తులం బంగారం ధర రూ. 1,150 తగ్గి రూ. 87,800 పలికింది. బుధవారం 99.9శాతం స్వచ్చత గల బంగారం ధరరూ. 89,350, 99.5శతం స్వచ్చత గల బంగారం ధర తులం రూ. 88,950 వద్ద స్థిరంగా ఉన్నాయి. గురువారం కిలో వెండి ధర రూ. 1,000క్షీణించి రూ. 98,500లకు పతనం అయ్యింది. బుధవారం కిలో వెండి ధర రూ. 99,500 దగ్గర ముగిసింది.
మల్టీ కమెడిటీ ఎక్స్చేంజ్ లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ఏప్రిల్ డెలివరీ తులం ధర రూ. 554 పతనమై రూ. 85,320లకు చేరింది. ఎంసీఎక్స్ లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో బంగారం ధరలు బలహీన పడ్డాయి. ఫలితంగా తులం బంగారం ధర రూ. 85,000లకు పడిపోయింది. ఇక ముందు రూ. 84,800స్థాయికి పతనం కావచ్చని ఎల్ కేపీ సెక్యూరిటీస్ కమోడిటి అండ్ కరెన్సీ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రీవేది తెలిపారు.