భగ్గుమన్న బంగారం! స్వల్పంగా తగ్గిన వెండి..ఈరోజు ధరలివే!

బంగారం భగ్గుమంది. కొద్ది కాలంగా కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు (28 ఏప్రిల్) ఒక్కసారిగా ఆకాశాన్నంటింది.

K V D Varma
Published on: 28 April 2020 7:06 AM IST
భగ్గుమన్న బంగారం! స్వల్పంగా తగ్గిన వెండి..ఈరోజు ధరలివే!
X
gold rate today

వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మరింత పెరిగి భారీ షాకిచ్చాయి. ఒకేసారి రెండువేల రూపాయలకు పైగా పైకెగాశాయి. ఈరోజు (ఏప్రిల్ 28) బంగారం ధరలు పది గ్రాములకు 2120 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు నిన్న పైకెగసిన దిగిన వెండి ధరలు ఈరోజు కాస్త కిందికి చూశాయి. కేజీకి 400 రూపాయల తగ్గుదల కనబరిచాయి.

బంగారం ధరలు ఈరోజు భారీగా ఎగశాయి. మంగళవారం (28.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 2120 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసి 44,740 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు భారీగా 970 రూపాయల పెరుగుదలతో 46,900 రూపాయలు నమోదు చేసింది.

కాస్త తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు మాత్రం స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కేజీకి 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు కంటే పైకి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 42,200 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా భారీ షాకిచ్చాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం ధర కంటే 2120 రూపాయల భారీ పెరుగుదల నమోదు చేసి 44,740 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 970 రూపాయల పెరుగుదలతో 46,900 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 42,200 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో...

ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1620 రూపాయల భారీ పెరుగుదలతో 47,650 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 2030 రూపాయల పెరుగుదలతో 45,150 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కు నుంచి పైకెగసింది. కేజీ వెండి ధర 42,200 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 28-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


K V D Varma

K V D Varma

Next Story