Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు ..తాజా ధరలు ఇవే
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు నగలు, వివాహాది శుభకార్యాలకు అవసరమయ్యే నగలు చేయించుకునే వారి సంఖ్య భారీగా పెరగడంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ సంచలన నిర్ణయాలు స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. దీంతో బంగారంను సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్న మదుపరులు దాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధరలు పెరుగుతున్నాయి. అతి త్వరలోనే బంగారం ధర రూ. 90వేలకు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నేడు మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నిన్న రూ. 85,930 ఉండగా నేడు రూ. 200 పెరిగి రూ. 86,130కి చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నిన్న 22 క్యారెట్లు 79, 090ఉండగా..రూ. 183 తగ్గి నేడు రూ. 78, 907కు చేరింది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,080 ఉండగా నేడు రూ. 200 పెరిగి రూ. 86,280వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 95,290 ఉండగా..ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ రూ. 95,450 ఉంది. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 95,600దగ్గర కొనసాగుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇవే..
ముంబై- రూ.79,090, రూ.86,280
పుణె- రూ.79,090, రూ.86,280
జైపూర్- రూ.79,081, రూ.86,270
పట్నా- రూ.79,044, రూ.86,230
చెన్నై- రూ.79,319, రూ.86,530
బెంగళూరు- రూ.79,154, రూ.86,350