మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలూ పెరిగాయి.. ఈరోజు ఎంతంటే..?
బంగారం ధరలు మూడో రోజూ పైకెగశాయి.. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఆ ప్రభావం దేశీయంగానూ పడింది. ఈరోజు (ఏప్రిల్ 25) బంగారం ధరలు పది గ్రాములకు 840 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు నిన్న కిందకి దిగిన వెండి ధరలు ఈరోజు పై చూపులు చూశాయి. కేజీకి 110 రూపాయల పెరుగుదల కనబరిచాయి.
బంగారం ధరలు ఈరోజు పై పైకి కదిలాయి. శుక్రవారం (24.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు గురువారం నాటి ధర కంటే 840 రూపాయల పెరుగుదల నమోదు చేసి 42,500 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 510 రూపాయల పెరుగుదలతో 45,810 రూపాయలు నమోదు చేసింది.
పెరిగిన వెండి ధరలు...
బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా వెండి ధరలు కూడా భారీ పెరుగుదలను నమోదు చేశాయి. కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న వెండి ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగిపోయింది. కేజీకి 110 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు కంటే పైకి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 42,530 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 840 రూపాయల పెరుగుదల నమోదు చేసి 42,500 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 510 రూపాయల పెరుగుదలతో 45,810 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 42,530 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరుగుదల కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 410 రూపాయల పెరుగుదలతో 45,910 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 230 రూపాయల పెరుగుదలతో 43,000 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కు నుంచి పైకెగసింది. కేజీ వెండి ధర 42,530 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




