Gold Rate Today: రెండురోజులుగా తగ్గిన పసిడి ధర.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే

Update: 2025-02-23 04:00 GMT

Gold Rate Today: దేశంలో రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం ధరలను అంతర్జాతీయ ఆర్ధిక అనిశ్చితి, రాజకీయ, బౌగోళిక ఉద్రిక్తతలు వంటివి ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలలుగా బంగారం ధరలు ఆకాశన్నంటాయి. నూతనంగా ఎన్నికైన అమెరకా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలతో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ట్రంప్ నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్న మదుపరులు దాన్ని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడి బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి.

నేడు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 78,769 ఉండగా..24క్యారెట్ల బంగారం ధర రూ. 85,930గా ఉంది. హైదరాబాద్,విశాఖ, విజయవాడ నగరాల్లో 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 79,026 ఉండగా..24క్యారెట్ల తులం బంగారం ధర రూ. 86,210 ఉంది. వెండి ధరలూ నేడు స్థిరంగానే కొనసాగుతున్నాయి.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నై- రూ.79,136, రూ.86,330

బెంగళూరు- రూ.78,962, రూ.86,140

కోల్‌కతా- రూ.78,797, రూ.85,960

భోపాల్- రూ.78,989, రూ.86,170

భువనేశ్వర్- రూ.78,925, రూ.86,100

తిరువనంతపురం-రూ.79,145, రూ.86,340

ముంబై- రూ.78,907, రూ.86,080

పుణె- రూ.78,907, రూ.86,080

జైపూర్- రూ.78,888, రూ.86,060

పట్నా- రూ.78,861, రూ.86,030

Tags:    

Similar News