మరింత తగ్గిన బంగారం.. కొండెక్కిన వెండి ధర ఎంతంటే..!
బంగారం ధరలు మూడో రోజూ కిందికి దిగొచ్చాయి. ఈరోజు (ఏప్రిల్ 21) బంగారం ధరలు పది గ్రాములకు 80 రూపాయల వరకూ తగ్గాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం అమాంతం పైకెగాశాయి..
బంగారం ధరలు మూడో రోజూ కిందికి దిగొచ్చాయి. ఈరోజు (ఏప్రిల్ 21) బంగారం ధరలు పది గ్రాములకు 80 రూపాయల వరకూ తగ్గాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం అమాంతం పైకేగాశాయి.. కేజీకి 1550 రూపాయల భారీ పెరుగుదల కనబరిచాయి.
బంగారం ధరలు ఈరోజు కూడా కిందికి దిగొచ్చాయి. మంగళవారం (21.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు సోమవారం నాటి ధర కంటే 80 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,430 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 90 రూపాయల తగ్గుదలతో 44,120 రూపాయలు నమోదు చేసింది.
భారీ షాకిచ్చిన వెండి ధరలు...
బంగారం ధరలు తగ్గుదల నమోదు చేయగా వెండి ధరలుమాత్రం ఒక్కసారిగా చుక్కలనంటాయి. వెండి ధర కేజీకి 1550 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 42 వేల మార్కు కంటే పైకి కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 42,700 రూపాయల వద్దకు చేరింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 80 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,430 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 80 రూపాయల తగ్గుదలతో 44,120 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా భారీగా పెరిగాయి . దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 42,700 రూపాయల వద్దకు చేరుకుంది.
దేశరాజధాని ఢిల్లీలో...
ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్దగుల కనబర్చాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80 రూపాయల తగ్గుదలతో 44,470 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయల తరుగుదలతో 41,900 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా తగ్గాయి. దీంతో కేజీ వెండి ధర 42 వేల మార్కు దాటిపోయింది.కేజీ వెండి ధర 42,700 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 21-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.




