Gold Rate Today: బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్నిరోజులుగా తగ్గిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈక్రమంలో మే 20వ తేదీ మంగళవారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 400పెరిగి రూ. 95,520కు చేరుకుంది. 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 370 పెరిగి రూ. 87,560కు చేరింది. మరోవైపు ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 95,670గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 87, 710గా ఉంది.
వెండి ధరలు కూడా భారీగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో మే 20వ తేదీనాటికి ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 1300 పెరిగింది. దీంతో రూ. 98, 100కు చేరుకుంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతిలో కిలో వెండి ధర రూ. 1,09, 000గా ఉంది. చెన్నై, కేరళ, భోపాల్ వంటి ప్రాంతాల్లో కూడా వెండి ధరలు రూ. 1,09,00 పలుకుతున్నాయి. మరోవైపు సోలాపూర్, నోయిడా, నాసిక్, మైసూర్, నాగ్ పూర్, పాట్నా, జైపూర్, ముంబై ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 98, 100గా ఉంది.