Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. మే ఒకటో తేదీ గురువారం ధరలు ఇవే.. కరుగుతున్న పసిడి

Update: 2025-05-01 03:30 GMT

Gold Rate Today: మే ఒకటో తేదీ గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. ఆల్ టైం రికార్డుతో పోల్చి చూస్తే బంగారం ధర ఏకంగా నాలుగు వేల రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,970 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,800 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ.106000 పలికింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి నెమ్మదిగా దిగి వస్తు న్నాయి.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులే కారణం అని చెప్పవచ్చు. అమెరికా డాలర్ బలపడటంతో పాటు, స్టాక్ మార్కెట్లో కూడా పాజిటివ్ సంకేతాలు ఇవ్వడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి. బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనం కావడంతో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో బంగారంలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం బంగారం భారీ లాభాలను అందించిన నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ అనేది సాగుతోంది.

దీంతో బంగారం ధరలు తగ్గడం ప్రారంభిస్తున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయంగా ఉన్న వాణిజ్య పరిస్థితుల్లో వస్తున్నటువంటి మార్పులు కూడా ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అమెరికా చైనా మధ్య సాగుతున్న వాణిజ్య యుద్ధం, ప్రస్తుతం సయోధ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా బంగారం ధరలు తగ్గడానికి దోహదపడ్డాయి అని చెప్పవచ్చు.

అయితే గడచిన పది సంవత్సరాలుగా పోల్చి చూస్తే బంగారం ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పవచ్చు. బంగారం 10 సంవత్సరాల క్రితం అంటే 2015లో 30 వేల రూపాయల సమీపంలో ఉంది. అక్కడి నుంచి పోల్చి చూస్తే బంగారం ధర దాదాపు మూడు రెట్లు పైన పెరిగింది. బంగారం లో ఎవరైతే పెట్టుబడి పెట్టారో వారికి మంచి రిటర్న్స్ అందించాయి అని చెప్పవచ్చు. అయితే బంగారంలో ఫిజికల్ రూపంలో పెట్టుబడి పెట్టే కన్నా గోల్డ్ ఈటీఎఫ్ స్కీముల్లో పెట్టుబడి పెట్టినట్లయితే చక్కటి రాబడి అందిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. 

Tags:    

Similar News