Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్..భారీగా తగ్గిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్..భారీగా తగ్గిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: బంగారం ధరలు కొద్దిరోజులుగా భారీగా తగ్గుతున్నాయి. ఆదివారం, శనివారం రెండు రోజులు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు యథాతథంగానే ఉన్నాయి. ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో తులం పది గ్రాములకు రూ. 89, 200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అంతకుముందు రోజు కూడా ధరలు స్థిరంగానే ఉన్నాయి. దానికి ముందు రోజు రూ. 250 పెరిగింది. 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర విషయానికి వచ్చినట్లయితే 10 గ్రాములకు రూ. 97, 310గా ఉంది. మరోవైపు వెండి ధర హైదరాబాద్ లో కిలోకు రూ. 1,10, 900 వద్ద ట్రేడ్ అవుతోంది.