Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై 3,800పెరిగిన పసిడి.. ఇలా అయితే కొనడం కష్టమే
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై 3,800పెరిగిన పసిడి.. ఇలా అయితే కొనడం కష్టమే
Gold Rate Today: బంగారం ధర భారీగా పెరిగింది. గతవారం చివరిలో తిరిగి పుంజుకున్న బంగారం ధరలు ఈ వారం కూడా అదే జోరుకు కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఆందోళనలు లేనప్పటికీ బంగారం ధర స్వల్పంగా పెరుగుదలను నమోదు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో శుభకార్యాలకు షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా పెరిగిన ధరలను పరిశీలించడం మంచిది.
22క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చి చూసుకుంటే 100 గ్రాములకు ఏకంగా రూ. 3,500 పెరుగుదల నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలించినట్లయితే గ్రాముకు చెన్నైలో రూ. 8,755, ముంబైలో రూ. 8,755, ఢిల్లీలో రూ.8,770 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో 24క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ. 3,800పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని పలు నగరాల్లో నేటి ధరలను చూస్తే ముంబై లో 9, 551, బెంగళూరులో రూ. 9,551, ఢిల్లీలో రూ. 9,566గా ఉన్నాయి.
ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 8,755 ఉండగా..24క్యారెట్ల బంగారం రిటైల్ విక్రయ ధరలు రూ. 9, 551 వద్ద ఉంది. ఇదే క్రమంలో వెండి కిలో ధర రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. లక్ష 9వేల దగ్గర ఉంది.