Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరువలో ట్రేడ్ అవుతోంది.
Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరువలో ట్రేడ్ అవుతోంది. నిన్న బుధవారంతో పోల్చితే నేడు గురువారం బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,920కి చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 92,500కు చేరుకుంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర ఈ రోజు దాదాపు రూ. 600 వరకు పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 1,01,070కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 92,660కి చేరింది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,00,920కి చేరుకుంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 92,500కు చేరుకుంది. వెండి ధరలు కిలోకు రూ. 100మేర పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు
హైదరాబాద్‌లో రూ. 1, 00, 920, రూ. 92, 500
విజయవాడలో రూ. 1, 00, 920, రూ. 92, 500
ఢిల్లీలో రూ. 1, 01, 070, రూ. 92, 660
ముంబైలో రూ. 1, 00, 920, రూ. 92, 500
వడోదరలో రూ. 1, 00, 970, రూ. 92, 560
కోల్‌కతాలో రూ. 1, 00, 920, రూ. 92, 500
చెన్నైలో రూ. 1, 00, 920, రూ. 92, 500
బెంగళూరులో రూ. 1, 00, 920, రూ. 92, 500