Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట కలిగించే విషయం. బంగారం ధర తగ్గింది. గత ఐదు రోజుల తర్వాత బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం కొనుగోలు దారులకు ఇది ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. అయితే బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో జనవరి 19వ తేదీ హైదరాబాద్ బంగారం ఎలా ఉందో తెలుసుకుందాం.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు దిగివచ్చాయి. దాదాపు 5 రోజుల తర్వాత బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర నేడు 10 గ్రాములపై రూ. 150 మేర తగ్గింది. దీంతో రూ. 74, 350కి చేరుకుంది. 24క్యారట్ల బంగారం ధర నేడు రూ. 160 తగ్గి..దీంతో తులం ధర రూ. 81, 110 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు గత మూడు రోజుల్లో కిలోపై దాదాపు రూ. 5వేలు పెరిగింది. నేడు వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,04,000 వద్ద అమ్ముడవుతోంది.