Gold Rate Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు మే 18వ తేదీ ఆదివారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Update: 2025-05-18 04:45 GMT

 Gold Rate Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు మే 18వ తేదీ ఆదివారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. గత రెడు రోజులుగా భారీగా తగ్గాయి. నేడు మే 18వ తేదీ ఆదివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేల ఏండ్ల నుంచి తిరుగులేని ఆభరణాల లోహంగా బంగారం కొనసాగుతోంది. ధరించడానికి మాత్రమే కాకుండా పెట్టుబడుల విషయంలోనూ బంగారం అగ్రస్థానంలో ఉంటోంది. అయితే పెట్టుబడులు పెట్టేవారు బంగారం ధరలు పెరగాలని కోరుకుంటారు కొనాలనేవారు తగ్గాలనుకుంటారు. నెలరోజుల క్రితం వరకు బంగారం కొనాలనుకునే వారికి ధరలు భారీగా పెరగడంతో ఆందోళన మొదలైంది. 24క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర లక్ష దగ్గర ట్రేడ్ అయ్యింది. కానీ భారత్ పాక్ యుద్ధం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడిప్పుడు ధరలు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి.

హైదరాబాద్ 10గ్రాముల బంగారం ధర 24క్యారెట్లు 95130 వద్ద ట్రేడ్ అయ్యింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87200 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 71350 దగ్గర ట్రేడ్ అయ్యింది. ఇక ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారం ధరలు పెరగలేదు అలాని తగ్గలేదు. నిన్నటి వలే 10గ్రాముల స్వచ్చమైన 24క్యారెట్ల బంగారం ధర ఇవాళ కూడా 95130 వద్ద ట్రేడ్ అవుతోంది. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87200 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10గ్రాముల 18 క్యారెట్ల ధర 71350 దగ్గర ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 10800 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది. కిలో వెండి ధర 1,08000 వద్ద ట్రేడ్ అయ్యింది. ఈ రోజు 100 గ్రాములు, కేజీ వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ రోజు కూడా 100 గ్రాముల వెండి ధర 10800 దగ్గర ట్రేడ్ అవుతోంది. కిలో బంగారం ధర 1,08000వద్ద ట్రేడ్ అవుతోంది. 

Tags:    

Similar News