Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త..మళ్లీ తగ్గిన బంగారం ధర..ఎంత తగ్గిందంటే?

Update: 2025-03-18 03:30 GMT

Gold Rate Today: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన అనంతరం పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ పైనా సుంకాలు విధింపులు ఉంటుందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే వాణిజ్య యుద్ధానికి దాని తీసి ప్రపంచ ఆర్థిక అనిశ్చితులకు దారి తీసింది. అలాగే అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయనే ఆందోళణలు నెలకున్న క్రమంలో పెట్టుబడిదారులు సురీక్షిత మార్గమైన బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు.

దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మధ్యే ఔన్స్ బంగారం ధర రికార్డ్ గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత మళ్లీ వెనక్కు తగ్గినా నేడు మళ్లీ 3000 డాలర్లు దాటింది. దీంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరుగుతాయనే ఆందోళనలు నెలకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గడం గమనార్హం. బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశమని చెప్పవచ్చు. మార్చి 18వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ బంగారం ధర ఔన్సుకు 3000 డాలర్లు దాటింది. అలాగే స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 33.88 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ రూ. 86.683 దగ్గర అమ్ముడవుతోంది.

కాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. మార్చి 16వ తేదీన స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఆ తర్వాత రోజు స్థిరంగా ఉంది. నేడు మార్చి 18వ తేదీన బంగారం ధరలు మరింత తగ్గాయి. 22క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 100 తగ్గడంతో రూ. 82వేల 100 వద్దకు చేరింది. ఇక 24క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 110 మేర తగ్గడంతో రూ. 89వేల 560 వద్దకు దిగివచ్చింది.

Tags:    

Similar News