Gold Rate Today: దిగివచ్చిన బంగారం ధర..తులపై 1200 తగ్గింపు

Gold Rate Today: బంగారం ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి.

Update: 2025-06-18 02:15 GMT

Gold Rate Today: దిగివచ్చిన బంగారం ధర..తులపై 1200 తగ్గింపు

Gold Rate Today: బంగారం ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతివిలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతుండటంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గినట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ తెలిపింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ. 1200 దిగివచ్చింది. దీంతో తులం బంగారం ధర రూ. 1,00, 170గా నమోదు అయ్యింది. అలాగే 99.5శాతం స్వచ్చత కలిగిన బంగారం ధర లక్షల రూపాయల దిగువకు పడిపోయింది. 10 గ్రాముల ధర రూ. 1,100 తగ్గి రూ. 99, 450కి చేరింది. ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తతకు మొగ్గు చూపడంతో ప్రపంచవ్యాప్తంగా ఆభరణాలకు డిమాండ్ భారీగా పడిపోయిందని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ వెల్లడించారు. కానీ వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

కిలో వెండి ధర రూ. 100 పెరిగి రూ. 1,07,200కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,380.65 డాలర్ల వద్ద కొనసాగుతుండగా వెండి 36.47 డాలర్ల దగ్గర ఉంది. అమెరికా ఫెడరల్ రిజర్వు తన పరపతి సమీక్ష సమావేశం కంటే ముందు రోజు అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడం విశేషమని గాంధీ తెలిపారు. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి పరిస్థితులు నెలకొనడం కూడా ధరలు తగ్గడానికి ప్రధానకారణమని ఆయన తెలిపారు.  

Tags:    

Similar News