Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..1500 పెరిగిన బంగారం ధర

Update: 2025-01-18 02:38 GMT

Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. జనవరి 18వ తేదీ శనివారం ఒకే రోజు తులంపై 1500 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 82వేలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 75,100 పెరిగింది. వెండి కిలో ధర రూ. 92,600కు పెరిగింది.

బంగారం ధరలు పెరగడానికి ప్రధానకారణం అంతర్జాతీయ పరిస్థితులే అని చెప్పవచ్చు. ప్రస్తుతం అమెరికా మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర 2750 డాలర్లు పలుకుతోంది. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు కూడా బంగారం ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. తాజాగా ఆసియా మార్కెట్లు అదేవిధంగా అమెరికా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి దారులు తమ సంపదను కోల్పోతున్నారు.

దీనికి తోడు బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ తీసుకునే ఆర్థిక విధివిధానాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇది కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటను దెబ్బతీసే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. 

Tags:    

Similar News