Gold Rate Today: గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు దిగివస్తున్నాయి. ఫిబ్రవరి 18 మంగళవారం బంగారం ఎంత పలుకుతుందో తెలుసుకుందాం. హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 78,919 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,089గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 1,11,200గా ఉంది. విజయవాడలో 10గ్రాముల బంగారం ధర రూ. 78,925 పలుకుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 86,095గా ఉంది. కిలో వెండి ధర రూ. 1,12,000గా ఉంది. విశాఖలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 78,927 ఉండగా..24క్యారెట్ల బంగారం ధర రూ. 86,097గా ఉంది. వంద గ్రాముల వెండి ధర రూ. 10,960గా ఉంది. ట్రంప్ టారీఫ్ భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల కోత, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.