బంగారం ధరలు ఈరోజూ పెరిగాయి.. వెండి ధరలు కూడా అదే దారిలో!

K V D Varma
Published on: 13 April 2020 7:03 AM IST
బంగారం ధరలు ఈరోజూ పెరిగాయి.. వెండి ధరలు కూడా అదే దారిలో!
X
gold rate today (representational image)

బంగారం ధరలు ఈరోజు కూడా పైకెగాశాయి.. ఈరోజు (ఏప్రిల్ 13) బంగారం ధరలు పది గ్రాములకు 280 రూపాయల వరకూ పెరిగాయి. మరో వైపు వెండి ధరలు కూడా కేజీకి 150 రూపాయల పెరుగుదల కనబరిచాయి.

బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరుగుదల నమోదు చేశాయి. సోమవారం (13.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 280 రూపాయల స్వల్ప పెరుగుదల నమోదు చేసి 40,430 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 190 రూపాయల స్వల్ప పెరుగుదలతో 44,100 రూపాయలు నమోదు చేసింది.

పెరిగిన వెండి ధరలు...

బంగారం ధరలతో పాటూ, వెండి ధరలు కూడా ఈరోజు స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. వెండి ధర కేజీకి 150 రూపాయల స్వల్పపెరుగుదల నమోదు చేసింది. దీంతో 41 వేల మార్కుకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 41,150 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 280 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,430 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 190 రూపాయల పెరుగుదలతో 44,100 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు కూడా ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర ఇక్కడ 41,150 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో బంగారం ధరలు అదేవిధంగా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 710 రూపాయల పెరుగుదలతో 44,970 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 280 రూపాయల పెరుగుదలతో 42,570 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి ధర 41 వేల పై మార్కు పైనే ఉంది. కేజీ వెండి ధర 41,150 రూపాయల వద్దనిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 13-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.



K V D Varma

K V D Varma

Next Story