Gold Rate Today: భారీగా తగ్గుతున్న బంగారం ధర... మే 10 శనివారం పసిడి ధర ఇంత తగ్గిందా..? మహిళలకు పండగే

Update: 2025-05-10 02:06 GMT

Gold Rate Today: బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: బంగారం ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. మే 10వ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,340 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,140 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ.1,10,000 పలికింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గడం ప్రారంభించాయి.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం అమెరికా చైనా మధ్య నడుస్తున్నటువంటి వాణిజ్య చర్చలే ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఒకవేళ ఈ చర్చలు సఫలం అయినట్లయితే స్టాక్ మార్కెట్లలో లాభాలు కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే డాలర్ బలపడే అవకాశం కూడా ఉంటుంది. ఈ సానుకూల అంశాల మధ్య బంగారం ధరలు తగ్గే వీలు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ బలపడటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

డాలర్ బలపడినట్లైతే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల పై పెడతారు అప్పుడు బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. దీంతో పాటు ప్రస్తుతం బిట్ కాయిన్ ధర కూడా ఒక లక్ష డాలర్లు దాటింది. ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించడానికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు. ఇది కూడా పరోక్షంగా బంగారం ధర తగ్గడానికి కారణమైందని చెప్పవచ్చు. దీనికి తోడు బంగారం ధరలు ఇప్పటికే ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ రూపంలో వెనక్కు తీసుకుంటున్నారు.

దీంతో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయని చెప్పవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి లేదా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణంగా నిలుస్తుంటాయి. దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నప్పటికీ బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం రికార్డు సాయి వద్ద ఉన్నాయి. అయితే బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అనే సందేహాలు చాలామందికి కలగడం సహజమే.

అయితే ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను బట్టి చూస్తున్నట్లయితే బంగారం ధరలు తీవ్రంగా హెచ్చు తగ్గులకు గురవుతున్నాయి. దీంతో బంగారం ధరలు అస్థిరంగా మారినట్లు గమనించవచ్చు. అయితే బంగారంపై పెట్టుబడి పెట్టే వారికి మాత్రం ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా డిజిటల్ గోల్డ్ రూపంలోనే పెట్టుబడి పెట్టినట్లయితే ఎక్కువ రాబడి లభించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ వంటి వాటిపై అవగాహన పెంచుకుంటే మంచిది. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా డిజిటల్ గోల్డ్ చాలా సురక్షితం.

Tags:    

Similar News