Gold: ఒక్క రోజులోనే రూ.6వేలు తగ్గిన బంగారం ధర

Gold: దేశంలో బంగారం ధరలు ఆకస్మాత్తుగా భారీగా పడిపోయాయి.

Update: 2025-10-22 07:51 GMT

Gold: ఒక్క రోజులోనే రూ.6వేలు తగ్గిన బంగారం ధర

Gold: దేశంలో బంగారం ధరలు ఆకస్మాత్తుగా భారీగా పడిపోయాయి. ఎప్పుడూ పైపైకి వెళ్తున్న పసిడి రేట్లు బుధవారం ఒక్కరోజులోనే రూ.6 వేల మేర తగ్గి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,150కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,500గా ఉంది.

వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.1,65,000కు చేరుకుంది. ఇటీవల బంగారం ధరలు గరిష్ఠ స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు లాభార్జనకు దిగారు. అదే సమయంలో అమెరికా డాలర్ విలువ పెరగడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం వంటి కారణాలు బంగారం ధరల పతనానికి దారితీశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో బంగారం మార్కెట్ ఒక్కసారిగా చల్లబడింది.

Tags:    

Similar News