Gold and Silver Prices Today: పసిడి ధరలు తగ్గాయి, కానీ వెండి రేట్లు స్థిరం

సెప్టెంబర్ 26, 2025 - బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన అప్‌డేట్.

Update: 2025-09-26 05:30 GMT

Gold and Silver Prices Today: పసిడి ధరలు తగ్గాయి, కానీ వెండి రేట్లు స్థిరం

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన అప్‌డేట్. ఇటీవల రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుతూ కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగించాయి. అయితే, వెండి ధరలు మాత్రం నిన్నటి మాదిరిగానే స్థిరంగా ఉన్నాయి.

బంగారం ధరలు

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, సెప్టెంబర్ 26న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.930 తగ్గి రూ.1,14,430కి చేరింది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,04,890గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి:

ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, పూణే:

24 క్యారెట్లు: రూ.1,14,430

22 క్యారెట్లు: రూ.1,04,890

ఢిల్లీ:

24 క్యారెట్లు: రూ.1,14,580

22 క్యారెట్లు: రూ.1,05,040

చెన్నై:

24 క్యారెట్లు: రూ.1,14,650

22 క్యారెట్లు: రూ.1,05,090

వెండి ధరలు

ఈ రోజు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ధరలు ఎక్కువగా ఉండగా, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో తక్కువగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు:

హైదరాబాద్, విజయవాడ, చెన్నై: రూ.1,49,900

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పూణే, వడోదర: రూ.1,39,900

గమనిక: బంగారం, వెండి ధరలు స్థానిక మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయ ధరలపై ఆధారపడి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ప్రస్తుత ధరలను నిర్ధారించుకోవడం మంచిది.

Tags:    

Similar News