December 31st: డీమ్యాట్ ఖాతాలో నామినీ నుంచి ఆధార్ అప్‌డేట్ వరకు.. ఈ నెలలో పూర్తి చేయాల్సిన 4 ముఖ్యమైన పనులివే..!

December 31 Deadline 2023: ఈ నెలలో అంటే డిసెంబర్‌లో మీరు చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేయవలసి ఉంటుంది. మీకు డీమ్యాట్ ఖాతా ఉండి, ఇంకా అందులో నామినీని జోడించకపోతే, డిసెంబర్ 31లోగా చేయాలి.

Update: 2023-12-06 16:00 GMT

December 31st: డీమ్యాట్ ఖాతాలో నామినీ నుంచి ఆధార్ అప్‌డేట్ వరకు.. ఈ నెలలో పూర్తి చేయాల్సిన 4 ముఖ్యమైన పనులివే..! 

December 31 Deadline 2023: ఈ నెలలో అంటే డిసెంబర్‌లో మీరు చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేయవలసి ఉంటుంది. మీకు డీమ్యాట్ ఖాతా ఉండి, ఇంకా అందులో నామినీని జోడించకపోతే, డిసెంబర్ 31లోగా చేయాలి. అలా చేయడంలో విఫలమైతే మీ ఖాతా ఆగిపోవచ్చు. దీంతో పాటు ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువు కూడా ఈ నెలతో ముగియనుంది. మీరు డిసెంబర్‌లో పూర్తి చేయాల్సిన 4 పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

డీమ్యాట్ ఖాతాకు నామినీని జోడించడానికి చివరి అవకాశం..

సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నామినీని డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్ ఖాతాకు జోడించడానికి డిసెంబర్ 31 వరకు సమయం ఇచ్చింది. ఇది కాకుండా, మార్కెట్ రెగ్యులేటర్ ఫిజికల్ సెక్యూరిటీ హోల్డర్‌లను పాన్, నామినేషన్, KYC వివరాలను అప్‌డేట్ చేయమని కోరింది.

మీరు మీ డీమ్యాట్ ఖాతాలో నామినీని ఇంకా జోడించకుంటే, కొత్త గడువులోగా చేయాలి. లేకుంటే మీ ఖాతా ఆగిపోవచ్చు. అంటే ఖాతా పనిచేయదు. ఇలా చేస్తే మీరు ఖాతా నుంచి మనీ విత్‌డ్రా చేయలేరు.

బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంది..

కొత్త బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్‌పై తమ ఖాతాదారులను సంతకం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని బ్యాంకులను కోరింది. బ్యాంక్ ఈ పనిని 31 డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయాలి. మీకు కూడా ఏదైనా బ్రాంచ్‌లో బ్యాంక్ లాకర్ ఉంటే, అక్కడికి వెళ్లి మీ కొత్త బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలి. లేకపోతే, మీరు తరువాత సమస్యలను ఎదుర్కోవచ్చు.

ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయండి..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి డిసెంబర్ 14 వరకు సమయం ఇచ్చింది. దీని తర్వాత, ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలో, జనాభా సమాచారం, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, మొబైల్ నంబర్, ఇమెయిల్ సరిదిద్దడానికి ఉచితంగా అవకాశం ఉంది. దీని కోసం ఎటువంటి ప్రత్యేక ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు.

కానీ, మీరు మీ బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే, మీరు రుసుము చెల్లించాలి. UIDAI ప్రకారం, ఈ కార్యక్రమం ప్రత్యేకంగా 10 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డు పొంది ఒక్కసారి కూడా అప్‌డేట్ చేసుకోని వారి కోసం ప్రారంభించారు.

IDBI బ్యాంక్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి..

IDBI బ్యాంక్ స్పెషల్ డిపాజిట్ స్కీమ్ అమృత్ మహోత్సవ్‌ను అమలు చేస్తోంది. ఇందులో 375 రోజుల 444 రోజుల FDలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 375 రోజుల FDలో, సాధారణ పౌరులకు 7.10% వడ్డీ ఇస్తున్నారు. సీనియర్ పౌరులకు 7.60% వడ్డీ ఇవ్వబడుతుంది. 444 రోజుల FDపై సాధారణ పౌరులకు 7.25% వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.75% వడ్డీ ఇవ్వబడుతుంది. డిసెంబర్ 31 వరకు ఇందులో పెట్టుబడులు పెట్టవచ్చు.

Tags:    

Similar News