వారికి రుణాలు మరింత సులువు.. కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన..!

KCC Holders: రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.

Update: 2022-12-02 10:22 GMT

వారికి రుణాలు మరింత సులువు.. కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన..!

KCC Holders: రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వారి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. వారికోసం అనేక పథకాలు ప్రారంభించి అమలు చేస్తోంది. వీటివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. గ్రామీణుల ఆదాయాన్ని పెంచడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) హోల్డర్లకు సులభంగా రుణాలు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు.

ఇటీవల ఆర్థిక మంత్రి ప్రభుత్వ రంగ బ్యాంకుల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో (సీఈఓ) సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణులకు సహాయం చేసేందుకు బ్యాంకు సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయాలని ప్రాంతీయ బ్యాంకులకు సూచించారు. వాస్తవానికి రైతుల ఆదాయంపై ఆర్థిక మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రైతులకి సులభంగా రుణాలు మంజూరుచేయాలని, ఎటువంటి ఇబ్బందులకి గురిచేయరాదని తెలిపారు.

కిసాన్ క్రెడిట్ కార్డ్

సమావేశం అనంతరం మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా రైతులకు సంస్థాగత రుణాలు ఎలా అందజేయాలో అధికారులకి సూచించారు. అలాగే ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కే కరాద్‌ ఫిషింగ్‌, డెయిరీ రంగంలో నిమగ్నమైన వారికి కేసీసీ జారీ చేయడంపై చర్చించారు. వ్యవసాయ రుణాలలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పాత్రపై దృష్టి సారించారు. ఇది కాకుండా డిజిటలైజేషన్, సాంకేతికతను మెరుగుపరచడంలో బ్యాంకులు సహాయం చేయాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News