PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు.. నేరుగా ఖాతాలోకే..!

PM Kisan FPO Scheme 2023: రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అద్భుతమైన వార్త వచ్చింది. ఈ మేరకు రూ.18 లక్షలు రైతులకు అందనున్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది.

Update: 2023-05-05 11:30 GMT

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు.. నేరుగా ఖాతాలోకే..!

PM Kisan: రైతులకు అద్భుతమైన వార్త అందింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు అందనున్నాయి. అవును... రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనాన్ని పొందుతున్నారు. దీని కింద ప్రభుత్వం ఏటా రూ.6000 మొత్తాన్ని రైతుల ఖాతాలకు బదిలీ చేస్తోంది. ఇప్పుడు రైతులకు లక్షల్లో లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వం ఏ పథకం కింద రూ.18 లక్షల ఆర్థిక సాయం ఇస్తుందో ఇప్పుడు చూద్దాం..

ఏ రైతులకు అందనుందంటే..

PM కిసాన్ FPO పథకం కింద, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించడానికి రైతులకు రూ.18 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే, దీని కోసం రైతులు కనీసం 11 మంది రైతులను కలిగి ఉన్నటువంటి సంస్థలో చేరాలి. దీనితో పాటు ఎరువులు, విత్తనాలు, రసాయనాలు, వ్యవసాయ యంత్రాలు వంటి నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తుంది.

రైతుల ఆదాయం మరింత పెరిగేలా..

రైతులు కూడా ఈ పథకం కింద బ్యాంకుల నుంచి తక్కువ ధరలకు రుణాలను పొందగలరు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం 'పీఎం కిసాన్‌ ఎఫ్‌పీఓ యోజన' పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతు ఉత్పత్తిదారుల సంస్థకు రూ.18 లక్షలు అందజేస్తారు. కొత్త వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దేశవ్యాప్తంగా రైతులకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి, 11 మంది రైతులు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో రైతులకు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు లేదా మందులు కొనుగోలు చేయడం కూడా సులభతరం కానుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు..

1. ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. హోమ్ పేజీలో FPO ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

3. ఇక్కడ 'రిజిస్ట్రేషన్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఫారం ఓపెన్ అవుతుంది.

4. ఫారమ్‌లో కోరిన మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి.

5. ఆ తర్వాత పాస్‌బుక్ లేదా క్యాన్సిల్ చెక్ లేదా IDని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.

6. చివరగా సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Tags:    

Similar News