త్వరలో ఉద్యోగులకి మంచి రోజులు.. పెన్షన్ రెట్టింపు అయ్యే అవకాశం..!

Pension Scheme: ఎంప్లాయీస్‌ పెన్షన్ స్కీమ్ (EPS)కింద ఉన్న పరిమితిని త్వరలో తొలగించవచ్చు.

Update: 2022-06-27 13:30 GMT

త్వరలో ఉద్యోగులకి మంచి రోజులు.. పెన్షన్ రెట్టింపు అయ్యే అవకాశం..!

Pension Scheme: ఎంప్లాయీస్‌ పెన్షన్ స్కీమ్ (EPS)కింద ఉన్న పరిమితిని త్వరలో తొలగించవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడవచ్చు. అయితే ఇది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ప్రస్తుతం గరిష్ట పెన్షన్ జీతం నెలకు 15,000 రూపాయలుగా ఉంది. అంటే మీ జీతం ఎంతైనా సరే పెన్షన్ లెక్క రూ.15,000 మాత్రమే. ప్రస్తుతం ఈ పరిమితి తొలగింపుపై కోర్టులో విచారణ జరుగుతోంది.

మనం ఉద్యోగం ప్రారంభించి ఈపీఎఫ్‌లో మెంబర్‌గా మారినప్పుడు ఈపీఎస్‌లో కూడా సభ్యత్వం పొందుతాం. ఉద్యోగి తన జీతంలో 12% EPFలో జమచేస్తాడు. అదే మొత్తాన్ని అతని కంపెనీ చెల్లిస్తుంది. కానీ దానిలో కొంత భాగం 8.33 శాతం EPSకి వెళ్తుంది. పైన పేర్కొన్నట్లుగా ప్రస్తుతం గరిష్ట పెన్షన్ జీతం 15 వేల రూపాయలు మాత్రమే. అంటే ప్రతి నెల పెన్షన్ వాటా గరిష్టంగా (15,000లో 8.33%) రూ. 1250.

ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పటికీ పెన్షన్‌ను లెక్కించడానికి గరిష్ట వేతనం రూ. 15 వేలుగా పరిగణిస్తారు. దీని ప్రకారం ఒక ఉద్యోగి ఈపీఎస్‌ కింద పొందగలిగే గరిష్ట పెన్షన్ రూ.7,500. మీరు సెప్టెంబరు 1, 2014 కంటే ముందు EPSకి కంట్రిబ్యూట్ చేయడం ప్రారంభించినట్లయితే మీకు పెన్షన్ కంట్రిబ్యూషన్ కోసం గరిష్టంగా నెలవారీ జీతం రూ.6500 ఉంటుంది. మీరు సెప్టెంబర్ 1, 2014 తర్వాత EPSలో చేరినట్లయితే గరిష్ట జీతం పరిమితి 15,000.

Tags:    

Similar News