EPFO Alert: పీఎఫ్‌ అలర్ట్‌.. వారికి రూ.50,000 అదనపు బోనస్..!

EPFO Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా ఉద్యోగులకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Update: 2022-10-07 11:30 GMT

EPFO Alert: పీఎఫ్‌ అలర్ట్‌.. వారికి రూ.50,000 అదనపు బోనస్..!

EPFO Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ద్వారా ఉద్యోగులకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇవి చాలా మందికి తెలియదు. ఉద్యోగి రిటైర్మెంట్‌ అయిన తర్వాత అతనికి రూ.50,000 వరకు అదనపు బోనస్ లభిస్తుంది. అయితే ఈ బోనస్ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌ ద్వారా లభించే ఈ అదనపు ప్రయోజనం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ అదనపు బోనస్‌ను లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద EPFO ఉద్యోగులకు అందజేస్తుంది. గత 20 సంవత్సరాలుగా PF ఖాతాలో డబ్బును డిపాజిట్ చేస్తున్న PF ఖాతాదారులకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం.. ప్రాథమిక జీతం 5 వేల రూపాయలు ఉన్న PF ఖాతాదారులకు 30 వేల రూపాయల అదనపు బోనస్ లభిస్తుంది. అదే సమయంలో రూ.5 నుంచి 10 వేల ప్రాథమిక వేతనం ఉన్న ఉద్యోగులకు రిటైర్మెంట్‌పై రూ.40 వేలు అదనపు బోనస్ లభిస్తుంది.

అదే సమయంలో 10 వేల రూపాయల కంటే ఎక్కువ బేసిక్‌ వేతనం ఉన్న ఉద్యోగులు రిటైర్మెంట్‌ సమయంలో రూ.50,000 అదనపు బోనస్ పొందుతారు. మరోవైపు 20 సంవత్సరాల వ్యవధిని పూర్తి చేయడానికి ముందే PF ఖాతా నిలిచిపోయినా ఈ ప్రయోజనం లభిస్తుంది. ఈ పరిస్థితులలో అదనపు బోనస్ అతని బేసిక్‌ జీతంపై ఆధారంగా లభిస్తుంది. అభ్యర్థులు ఈ ప్రయోజనాన్ని అస్సలు మిస్‌ చేసుకోకూడదు.

Tags:    

Similar News