EPFO Alert: ఈపీఎఫ్‌వో హెచ్చరిక.. పొరపాటున ఈ తప్పు చేయవద్దు..!

EPFO Alert: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులందరికి హెచ్చరిక జారీ చేసింది.

Update: 2022-10-09 10:30 GMT

EPFO Alert: ఈపీఎఫ్‌వో హెచ్చరిక.. పొరపాటున ఈ తప్పు చేయవద్దు..!

EPFO Alert: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులందరికి హెచ్చరిక జారీ చేసింది. పొరపాటున కూడా సోషల్ మీడియాలో ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని షేర్‌ చేయవద్దని అలర్ట్‌ చేసింది. దీని కారణంగా ఖాతాదారులు పెద్ద నష్టానికి గురవుతారని తెలిపింది. ఈపీఎఫ్‌వోకి ఖాతాకు సంబంధించిన సమాచారం మోసగాళ్ల చేతిలో ఉంటే వారు ఖాతా నుంచి డబ్బును దొంగిలిస్తారని పేర్కొంది.

EPFO ఎప్పుడు కానీ తన సభ్యుల నుంచి ఆధార్, పాన్, UAN, బ్యాంక్ వివరాల సమాచారాన్ని అడగదని తెలిపింది. ఎవరైనా అలాంటి సమాచారాన్ని ఫోన్ లేదా సోషల్ మీడియాలో అడిగితే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అస్సలు అలాంటి వివరాలని తెలపకూడదని పేర్కొంది. ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్‌లకు స్పందించవద్దని, మెస్సేజ్‌లకి బదులివ్వదని చెప్పింది.

ఉద్యోగులు రిటైర్మెంట్‌ కోసం PF ఖాతాలో పెద్ద మొత్తం జమ చేసుకుంటారు. వారి వ్యక్తిగత వివరాలని దొంగిలిస్తే పెద్ద మొత్తం లభిస్తుందని మోసగాళ్లకు తెలుసు. అందుకే రకరకాలుగా ప్రయత్నిస్తారు. ఎక్కువగా ఫిషింగ్ ద్వారా ఖాతాపై దాడి చేస్తారు. వాస్తవానికి ఫిషింగ్ అనేది ఆన్‌లైన్ మోసం. ఇందులో ఖాతాదారుడికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం అతడి నుంచే సేకరించి ఖాతాలో ఉన్న సొమ్ముని దొంగిలించడం జరుగుతుంది. ఒక ఉద్యోగాన్ని వదిలి వేరే చోట చేరేవారిలో ఇలాంటి మోసాలు ఎక్కువగా కనిపిస్తాయి.

Tags:    

Similar News