PF Withdrawal : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచే ఏటీఎం నుంచి ఫీఎఫ్ డబ్బులు విత్ డ్రా సదుపాయం
PF Withdrawal: ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. ఇకపై ATMల నుంచే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. జూన్ 2025 నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.
PF Withdrawal: ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. ఇకపై ATMల నుంచే మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. జూన్ 2025 నుంచే ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ EPFO 3.0ను ఈ నెలలో ప్రారంభించనుంది. దీని ద్వారా పీఎఫ్ ఖాతాదారులకు పలు అద్భుతమైన సేవలు అందుబాటులోకి వస్తాయి.
EPFO 3.0 అంటే ఏమిటి?
ఇది EPFO వ్యవస్థకు ఇది ఒక అప్‌గ్రేడెడ్ వెర్షన్. పూర్తిగా డిజిటల్, వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా దీనిని రూపొందించారు. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే బోలెడన్ని పేపర్ వర్క్ చేయాల్సి రావడం, డబ్బుల కోసం వారాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. EPFO 3.0తో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. పీఎఫ్ సంబంధించిన ప్రతి ప్రక్రియను సులభతరం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మన్‌సుఖ్ మాండవియా ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు. దాదాపు 9 కోట్ల మందికి పైగా EPF సభ్యులకు దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది.
ATM నుంచి పీఎఫ్ డబ్బులు ఎలా తీయాలి?
యూఏఎన్ (UAN) బ్యాంక్, ఆధార్‌తో అనుసంధానం: ATM నుంచి పీఎఫ్ డబ్బులు తీసుకోవాలంటే మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) తప్పనిసరిగా యాక్టివేట్ అయి ఉండాలి. అంతేకాదు, మీ UANకు బ్యాంక్ అకౌంట్, ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. దీనికి చివరి తేదీ జూన్ 30.
ఏదైనా ATMకి వెళ్లొచ్చు: UAN లింక్ పూర్తయిన తర్వాత మీరు ఏదైనా ATMకి వెళ్లి మీ పీఎఫ్ కార్డ్‌ని ఉపయోగించి డబ్బులు తీసుకోవచ్చు.
డబ్బుల విత్ డ్రా లిమిట్ : ప్రారంభంలో మీ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బులో 50శాతం వరకు మాత్రమే డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీ ఖాతాలో రూ. 10 లక్షలు ఉంటే, మీరు రూ. 5 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ పరిమితిని ప్రభుత్వం పెంచే అవకాశం ఉంది.
బ్యాలెన్స్ చెక్, నిధుల బదిలీ: ఈ కార్డ్‌తో డబ్బులు తీసుకోవడమే కాకుండా, మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, మీరు ఏ బ్యాంక్ అకౌంట్‌కైనా ఒక్క క్లిక్‌లో నిధులు బదిలీ చేయవచ్చు.
ఆటో-క్లెయిమ్ సెటిల్‌మెంట్
EPFO 3.0లో మరో ముఖ్యమైన సదుపాయం ఆటో-క్లెయిమ్ సెటిల్‌మెంట్. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే, వాటి ప్రాసెసింగ్ కోసం చాలా రోజులు పట్టేది. కొన్నిసార్లు దరఖాస్తులు రిజెక్ట్ అయ్యేవి. ఇప్పుడు ఆటో-క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగానే సిస్టమ్ ఆటోమేటిక్‌గా దానిని ప్రాసెస్ చేస్తుంది. దీనిలో మానవ జోక్యం ఉండదు కాబట్టి, మీ డబ్బులు కొన్ని రోజుల్లోనే మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ అవుతాయి.
యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ డబ్బులు?
ATM కార్డ్‌తో పాటు, EPFO 3.0లో యూపీఐ (UPI) సదుపాయం కూడా అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అంటే, మీ పీఎఫ్ ఖాతా నుంచి యూపీఐ ద్వారా నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు డబ్బులు ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. ఇది ATM వరకు వెళ్లలేని వారికి లేదా GPay, PhonePe, Paytm వంటి యూపీఐ యాప్‌లు ఉపయోగించే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూపీఐ ద్వారా డబ్బులు తీసుకోవడానికి మీ UANను యూపీఐ ప్లాట్‌ఫామ్‌తో లింక్ చేసి, ఓటీపీ ద్వారా లావాదేవీలు చేయవచ్చు.
ఎవరికి ఈ ప్రయోజనం?
EPFOతో రిజిస్టర్ అయి ఉన్న ప్రతి పీఎఫ్ ఖాతాదారుడు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే, EPFO కింద రిజిస్టర్ అయిన కంపెనీలో పనిచేస్తూ, మీ జీతం నుంచి పీఎఫ్ కట్ అవుతుంటే, మీరు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.