EPFO Alert: ఈపీఎఫ్‌వో అలర్ట్‌.. వీటిని నివారించడానికి ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

EPFO Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆన్‌లైన్ మోసాల గురించి ఖాతాదారులని హెచ్చరిస్తోంది.

Update: 2023-01-03 09:27 GMT

EPFO Alert: ఈపీఎఫ్‌వో అలర్ట్‌.. వీటిని నివారించడానికి ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

EPFO Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆన్‌లైన్ మోసాల గురించి ఖాతాదారులని హెచ్చరిస్తోంది. అంతేకాదు ఇలాంటి మోసాల నుంచి రక్షించడానికి కొన్ని చిట్కాలను చెబుతోంది. ఫేక్ కాల్స్ లేదా మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. UAN, పాస్‌వర్డ్, పాన్ లేదా ఆధార్ సమాచారాన్ని ఎవరితోనూ షేర్‌ చేసుకోవద్దని ట్విట్టర్‌ ద్వారా తెలిపింది.

ఆధార్ కార్డ్ నంబర్, పాన్, UN, బ్యాంక్ ఖాతా లేదా OTP వంటి వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా ఈపీఎఫ్‌వో ఎప్పుడు అడగదని తెలిపింది. నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి ఈపీఎఫ్‌వో కొంతమంది పెన్షనర్లకు మరింత ఎక్కువ పొందడానికి మార్గం సుగమం చేసింది. అయితే ఆగస్టు 31, 2014 లోపు రిటైర్‌మెంట్‌ అయిన వారు ఈ ప్రయోజనం పొందలేరు. సెప్టెంబర్ 1, 2014 తర్వాత EPS పథకంలో చేరిన వారికి అధిక పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. దీని కోసం EPFO అర్హత, విధానానికి సంబంధించిన నియమాలను జారీ చేసింది.

EPFO ఇటీవల మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగులు ఇప్పుడు వారి మొత్తం జీతంలో 8.33 శాతానికి సమానమైన మొత్తాన్ని EPSలో డిపాజిట్ చేసే అవకాశాన్ని పొందుతారు. దీని గరిష్ట పరిమితి నెలకు రూ. 15,000గా నిర్ణయించారు. ఉద్యోగ సమయంలో EPSలో సభ్యునిగా ఉన్నప్పుడు జీతం పరిమితి రూ.5000 లేదా రూ.6500 కంటే ఎక్కువ మొత్తంలో పెన్షన్‌కు విరాళాలు అందించిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.

Tags:    

Similar News