EPFO: మొబైల్‌కే పీఎఫ్ అకౌంట్ వివరాలు.. నంబర్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా ?
EPFO: ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ( EPFO) కు సంబంధించిన చాలా పనులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. అందుకే EPFO అకౌంట్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఉండటం చాలా అవసరం.
EPFO: మొబైల్‌కే పీఎఫ్ అకౌంట్ వివరాలు.. నంబర్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసా ?
EPFO: ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ( EPFO) కు సంబంధించిన చాలా పనులు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. అందుకే EPFO అకౌంట్‌లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఉండటం చాలా అవసరం. ఎందుకంటే, మీ పాస్‌వర్డ్ మార్చుకోవాలన్నా, పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా, క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవాలన్నా లేదా ఇతర సేవలు పొందాలన్నా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కే OTP వస్తుంది. ఒకవేళ మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయకపోతే లేదా మీరు కొత్త నంబర్ తీసుకున్నట్లయితే, దాన్ని ఇంట్లోనే కూర్చుని ఈజీగా అప్ డేట్ చేసుకోవచ్చు.
పీఎఫ్ అకౌంట్‌లో మొబైల్ నంబర్ ఎలా అప్‌డేట్ చేయాలి?
EPFO అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
* ముందుగా, EPFO అధికారిక వెబ్‌సైట్ (www.epfindia.gov.in) లోకి వెళ్లండి.
* అక్కడ మీరు మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN), పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ సాయంతో లాగిన్ అవ్వండి.
* లాగిన్ అయిన తర్వాత, 'Manage' అనే ట్యాబ్లోకి వెళ్ళండి.
* అక్కడ 'Contact Details' అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* ఇప్పుడు, మీరు మార్చాలనుకుంటున్న కొత్త మొబైల్ నంబర్‌ను రెండు సార్లు సరిగ్గా ఎంటర్ చేయాలి.
* ఆ తర్వాత 'Get Authorization PIN' పై క్లిక్ చేయండి.
* మీరు కొత్తగా నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు 4 అంకెల పిన్ వస్తుంది.
* ఆ పిన్‌ను సంబంధిత బాక్స్‌లో నమోదు చేసి, 'Save Changes' పై క్లిక్ చేయండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ అయినట్లు EPFO నుండి SMS ద్వారా కన్ఫాం మెసేజ్ వస్తుంది.
ఆఫ్‌లైన్‌లో కూడా మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయవచ్చు:
ఆన్‌లైన్ ప్రక్రియలో ఇబ్బంది పడేవారు ఈ పనిని ఆఫ్‌లైన్‌లో కూడా చేయవచ్చు.
దీని కోసం, మీరు ఒక ఫామ్‌ను నింపి అందులో మీ కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మీరు ఇచ్చే కొత్త మొబైల్ నంబర్ తప్పనిసరిగా మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. ఈ నింపిన ఫామ్‌ను మీ యజమాని (Employer) ద్వారా సంతకం చేయించి, ధృవీకరించుకొని మీ రీజనల్ ఫీఎఫ్ ఆఫీసులో సబ్మిట్ చేయాలి. ప్రక్రియ పూర్తయిన తర్వాత, EPFO నుండి మీకు ఒక కన్ఫాం మెసేజ్ వస్తుంది.
EPFO ఈ సౌకర్యంతో లక్షలాది ఉద్యోగులకు ప్రయోజనం
EPFO అందించిన ఈ సౌకర్యంతో లక్షలాది మంది ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు వారు తమ పీఎఫ్ సంబంధిత పనుల కోసం పదేపదే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం ద్వారా EPFO సేవలను పొందడం మరింత సులభతరం అవుతుంది. పీఎఫ్ క్లెయిమ్ చేసుకోవడం నుండి బ్యాలెన్స్ చెక్ చేయడం వరకు అన్ని ప్రక్రియలు సులభంగా పూర్తి చేసుకోవచ్చు.