EPFO Alert: ఈపీఎఫ్‌వో అలర్ట్‌.. UAN నెంబర్‌కి సంబంధించి ఈ పని చేశారా..!

EPFO Alert: మీరు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యుడిగా ఉన్నారా.. అయితే UAN నెంబర్‌ని యాక్టివేట్ చేయకపోతే టెన్షన్ పడకండి.

Update: 2022-09-19 07:30 GMT

EPFO Alert: ఈపీఎఫ్‌వో అలర్ట్‌.. UAN నెంబర్‌కి సంబంధించి ఈ పని చేశారా..!

EPFO Alert: మీరు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యుడిగా ఉన్నారా.. అయితే UAN నెంబర్‌ని యాక్టివేట్ చేయకపోతే టెన్షన్ పడకండి. ఇప్పుడు ఎవరైనా EPFO సభ్యులు ఇంట్లో కూర్చొని UAN నంబర్‌ను క్రియేట్‌ చేయవచ్చు. 7 దశలలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే UAN నంబర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా.. దీని గురించి తెలుసుకుందాం.

UAN నంబర్ ప్రయోజనాలు

1. UAN ద్వారా మీరు PF ఖాతా అన్ని కార్యకలాపాలను ట్రాక్ చేయగలరు.

2. మీకు ఒకటి కంటే ఎక్కువ PF ఖాతాలు ఉన్నట్లయితే UANని ఉపయోగించి అన్ని ఖాతాల వివరాలను ఒకే దగ్గర చూడవచ్చు.

3. ఆన్‌లైన్ PF పాస్‌బుక్ UAN ద్వారా మాత్రమే కనిపిస్తుంది.

4. UAN ద్వారా ఖాతాదారులు ఆన్‌లైన్‌లో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.

5. UAN ద్వారా మీ ఖాతాల్లో ఒకదాని మొత్తాన్ని మరొకదానికి బదిలీ చేయవచ్చు.

UAN నంబర్‌ని ఎలా క్రియేట్‌ చేయాలి..?

1. ముందుగా మీరు EPFO అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.inకి వెళ్లాలి.

2. తర్వాత అవర్ సర్వీసెస్‌ ఎంచుకుని అందులో ఎంప్లాయీస్ కోసం క్లిక్ చేయండి.

3. తర్వాత 'మెంబర్ UAN/ ఆన్‌లైన్ సర్వీసెస్‌'పై క్లిక్ చేయండి.

4. ఆపై 'యాక్టివేట్ యువర్ UAN'పై క్లిక్ చేయండి (ఇది ముఖ్యమైన లింక్‌ల దిగువ కుడి వైపున ఉంటుంది).

5. ఇప్పుడు UAN, పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, క్యాప్చా వంటి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి ఆపై 'ఆథరైజేషన్ పిన్ పొందండి'పై క్లిక్ చేయండి.

6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. 'ఐ అగ్రీ'పై క్లిక్ చేసి OTP ఎంటర్ నొక్కండి.

7. చివరగా 'OTP, యాక్టివేట్ UAN'పై క్లిక్ చేయండి.

8. మీరు భారత ప్రభుత్వ UMANG యాప్‌లో కూడా PF ఖాతాకు సంబంధించిన వివరాలను చూడవచ్చు. ఈ యాప్‌ని ఉపయోగించి ఉద్యోగి తన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయవచ్చు.

Tags:    

Similar News