June New Rules: నేటి నుంచి కొత్త రూల్స్..తప్పక తెలుసుకోవాల్సిందే..లేదంటే ఇబ్బందులు తప్పవు..!!

Update: 2025-06-01 01:51 GMT

June New Rules: నేటి నుంచి కొత్త రూల్స్..తప్పక తెలుసుకోవాల్సిందే..లేదంటే ఇబ్బందులు తప్పవు..!!

New rules from June 1: నేటి నుంచి అనే కొత్త రూల్స్ రాబోతున్నాయి. డబ్బుకు సంబంధించిన అనేక నియమాలు మారబోతున్నాయి. వీటిలో PF , FD రేట్లు, క్రెడిట్ కార్డ్ వాడకంపై ఛార్జీలు ఉన్నాయి. మీరు PF కట్ అవుతుంటే..లేదా మీరు FD చేసి ఉంటే లేదా అలా చేయాలని ప్లాన్ చేస్తుంటే లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించాలనుకుంటే, మీరు ఈ కొత్త నియమాల గురించి తెలుసుకోవాలి. ఈ నియమాలు మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.

EPFO తన వ్యవస్థను మారుస్తోంది. దీనికి EPFO ​​3.0 అని పేరు పెట్టారు. దీనివల్ల పీఎఫ్ నుంచి డబ్బులు తీసుకోవడం సులభతరం అవుతుంది. ఇది మాత్రమే కాదు మీరు KYC అప్‌డేట్ కోసం కూడా ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టడంతో క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి తక్కువ సమయం పడుతుంది. మీరు ATM కార్డ్ లాంటి కార్డును కూడా పొందవచ్చు. దీని ద్వారా మీరు PF డబ్బును సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇది EPFO ​​సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

మ్యూచువల్ ఫండ్ల కొత్త నియమాలు:

సెబీ మ్యూచువల్ ఫండ్ల నియమాలను కూడా మార్చింది. మ్యూచువల్ ఫండ్ పథకాలకు సెబీ కటాఫ్ సమయాన్ని మార్చింది. కట్-ఆఫ్ టైమింగ్ అంటే మీరు మ్యూచువల్ ఫండ్ నుండి డబ్బు పెట్టుబడి పెట్టడానికి లేదా విత్ర డ్రా చేసుకునేందుకు ఎంతకాలం వరకు ఉంటుంది. ఇప్పుడు ఆఫ్‌లైన్ లావాదేవీలకు కటాఫ్ సమయం మధ్యాహ్నం 3 గంటలు, ఆన్‌లైన్ లావాదేవీలకు సాయంత్రం 7 గంటలు. ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీలు మీ డబ్బును మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది.

క్రెడిట్ కార్డులో ఎలాంటి మార్పులు వస్తాయి?

కోటక్ మహీంద్రా బ్యాంక్ తన క్రెడిట్ కార్డు నియమాలను మార్చబోతోంది. ఈ మార్పులు జూన్ 1 నుండి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు మీరు కొన్ని సేవలకు కొత్త ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ విఫలమైతే లేదా మీరు డైనమిక్ కరెన్సీ మార్పిడిని నిర్వహిస్తే, మీరు ఛార్జ్ చెల్లించాలి.

యాక్సిస్ బ్యాంక్ తన రివార్డ్స్ క్రెడిట్ కార్డులో కూడా కొన్ని మార్పులు చేయబోతోంది. ఈ మార్పులు జూన్ 20, 2025 నుండి అమల్లోకి వస్తాయి. ఈ మార్పులలో రివార్డ్ పాయింట్ల గణన పద్ధతి. వ్యాపారి వర్గీకరణలో మార్పులు, కొత్త ఆఫర్‌లు, రీడీమ్ చేయని రివార్డ్ పాయింట్ల చెల్లుబాటు నియమాలు ఉన్నాయి. ఈ మార్పులు మీ ఖర్చులను మెరుగ్గా నిర్వహించడంలో మీకు సహాయపడతాయి.

FD వడ్డీ రేట్లు తగ్గుతాయి

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. ఈ కొత్త రేట్లు జూన్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఇప్పుడు మీకు 4% నుండి 8.4% వరకు వడ్డీ లభిస్తుంది. 30 నుండి 36 నెలల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై అత్యధిక వడ్డీ లభిస్తుంది. మార్కెట్లో వడ్డీ రేట్లు మారుతున్నందున ఈ మార్పు జరుగుతోంది.

ఆధార్ కార్డు అప్ డేట్ కు చివరి తేదీ

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జూన్ 14, 2025 వరకు ఆధార్ కార్డుదారులకు ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. ఈ తేదీ తర్వాత, ఆధార్ అప్‌డేట్ కోసం రూ. 50 రుసుము చెల్లించాలి.

Tags:    

Similar News