EPFO: ఉద్యోగులకి అలర్ట్‌.. పీఎఫ్‌ విషయంలో ఇలా జరిగితే మేల్కోండి..!

EPFO: మీరు ఏదైనా కంపెనీ లేదా సంస్థలో ఉద్యోగి అయితే జీతంలో కొంత మొత్తాన్ని EPF పథకంలో జమచేయాలి.

Update: 2022-09-21 06:30 GMT

EPFO: ఉద్యోగులకి అలర్ట్‌.. పీఎఫ్‌ విషయంలో ఇలా జరిగితే మేల్కోండి..!

EPFO: మీరు ఏదైనా కంపెనీ లేదా సంస్థలో ఉద్యోగి అయితే జీతంలో కొంత మొత్తాన్ని EPF పథకంలో జమచేయాలి. అలాగే మీ యజమాని లేదా కంపెనీ కూడా అంతే మొత్తాన్ని జమచేయాల్సి ఉంటుంది. ఈ నిర్దిష్ట మొత్తాన్ని ఉద్యోగి అత్యవసర సమయంలో లేదా రిటైర్మెంట్‌ సమయంలో విత్‌ డ్రా చేసుకుంటాడు. అయితే చాలాసార్లు కొంతమంది కంపెనీలు, యజమానులు వారు చెల్లించాల్సిన మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేయరు. దీంతో ఉద్యోగి చాలా నష్టపోతాడు. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుందాం.

ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు, యజమానులు కలిసి 12 శాతం ఈపీఎఫ్‌వోలో జమ చేయాలి. EPFO నెలవారీ డిపాజిట్ల గురించి SMS ద్వారా చందాదారులకు అప్‌డేట్ చేస్తుంది. ఉద్యోగులు EPFO పోర్టల్‌కి లాగిన్ అవడం ద్వారా ప్రతి నెలా PF ఖాతాలో చేసిన డిపాజిట్లను తనిఖీ చేయవచ్చు. కానీ చాలా కంపెనీల యజమానులు ఉద్యోగులకి రావల్సిన మొత్తాన్ని పీఎఫ్‌ ఖాతాలో జమచేయరు. అప్పుడు సదరు ఉద్యోగి కంపెనీ లేదా ఆ యజమానిపై చర్య తీసుకోవచ్చు.

ఉద్యోగులు PF సహకారాన్ని అందించకుంటే యజమానిపై EPFOకి ఫిర్యాదు చేయవచ్చు. రిటైర్‌మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ యజమానిపై విచారణ చేస్తుంది. అందులో ఈపీఎఫ్ మొత్తం డిపాజిట్ చేయలేదని తేలితే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. EPFO అధికారులు ఆలస్య డిపాజిట్ కారణంగా వడ్డీని కూడా వసూలు చేస్తారు. రికవరీ చర్యను ప్రారంభిస్తారు. ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 406, 409 కింద యజమానిపై పోలీసులకి ఫిర్యాదు చేస్తుంది.

ఉద్యోగుల భవిష్య నిధి, ఇతర నిబంధనల చట్టం, 1952లోని 14-B కింద నష్టపరిహారాన్ని పొందేందుకు EPFOకి అధికారం ఉంటుంది. ఇక్కడ యజమాని PF ఖాతాకు సహకారాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అవుతాడు. EPFO శిక్షాత్మక చర్యను ప్రారంభించే ముందు యజమానికి సహేతుకమైన అవకాశాన్ని ఇస్తుంది. ప్రస్తుత పన్ను నిబంధనల ప్రకారం యజమానులు PF ఖాతాలో డిపాజిట్ చేయడంలో విఫలమైతే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయలేరు.

Tags:    

Similar News