Investment Tips: పెట్టుబడి విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే మొత్తం కోల్పోతారు..!

Investment Tips: సంపాదించడం ఎవరైనా చేస్తారు కానీ వాటిని ఏ విధంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు అనే దానిపై రాబడి ఆధారపడి ఉంటుంది.

Update: 2023-07-27 15:30 GMT

Investment Tips: పెట్టుబడి విషయంలో ఈ తప్పులు చేయవద్దు.. లేదంటే మొత్తం కోల్పోతారు..!

Investment Tips: సంపాదించడం ఎవరైనా చేస్తారు కానీ వాటిని ఏ విధంగా ఇన్వెస్ట్‌ చేస్తున్నారు అనే దానిపై రాబడి ఆధారపడి ఉంటుంది. పెట్టుబడి ఎంత ఉత్తమంగా ఉంటే రాబడి అంత ఎక్కువగా వస్తుంది. కానీ చాలామంది సంపాదిస్తారు కానీ సరైన పెట్టుబడి పెట్టడం తెలియదు. దీంతో ఒక్కోసారి మొత్తం కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఒక బేసిక్‌ విషయం గుర్తుంచుకోవాలి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

వేర్వేరు ప్రదేశాలలో పెట్టుబడి

పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక బేసిక్‌ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పెట్టుబడి పోర్ట్‌ఫోలియో ఎల్లప్పుడూ వైవిధ్యంగా ఉండాలి. డబ్బును వేర్వేరు ప్రదేశాలలో పెట్టుబడి పెట్టాలి. మొత్తం డబ్బు ఒకే చోట ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయిన సందర్భంలో పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. మొత్తం డబ్బు నష్టపోతారు.

మంచి రాబడి

డబ్బులు వేర్వేరు ప్రదేశాలలో పెట్టుబడి పెట్టినప్పుడు పోర్ట్‌ఫోలియో వైవిధ్యంగా ఉంటుంది. దీనివల్ల మంచి రాబడి వస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక దానిలో నష్టం వస్తే అది ఒక్కటి మాత్రమే కోల్పోతారు. మిగతా పెట్టుబడులు భద్రంగా ఉంటాయి. దీనివల్ల నష్టం భారం తప్పించుకోవచ్చు. అంతేకాదు నష్టపోయిన డబ్బులని వీటి ద్వారా తిరిగి పొందే అవకాశాలు కూడా ఉంటాయి.

మనీ ఇన్వెస్ట్‌మెంట్

రిస్క్ ఉన్న ప్రదేశాలలో ఎంత పెట్టుబడి పెట్టాలి.. తక్కువ రిస్క్ ఉన్న ప్రదేశాలలో ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలి అనే విషయాన్ని గమనించాలి. ఈ రెండు విషయాలని ఎల్లప్పుడు బ్యాలెన్స్‌ చేయాలి. లాభాలు అధికంగా వస్తున్నాయని మొత్తం డబ్బు ఒక దానిలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. ఒకవేళ అది నష్టాల బారినపడితే మొత్తం కోల్పోతారు. అందుకే సగం రిస్క్‌ ఎక్కవ ఉన్న దానిలో సగం తక్కువ రిస్క్‌ ఉన్నదానిలో పెట్టుబడి పెట్టాలి.

Tags:    

Similar News