దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాలు..

దేశీయ స్టాక్ మార్కెట్లు మూరత్‌ ట్రేడింగ్‌ ముందు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, లాభాల స్వీకరణతో భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి.

Update: 2020-11-13 12:00 GMT

దేశీయ స్టాక్ మార్కెట్లు మూరత్‌ ట్రేడింగ్‌ ముందు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, లాభాల స్వీకరణతో భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 43,443 వద్ద స్థిరపడగా..నిఫ్టీ 29 పాయింట్ల స్వల్ప లాభంతో 12,720 వద్ద స్థిరపడింది...కాగా మార్కెట్ వర్గాలు దీపావళిని కొత్త సంవత్సరంగా భావిస్తుంటాయి..ప్రతి ఏడాది పండుగ రోజున మూరత్‌ ట్రేడింగ్‌ నిర్వహించి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తాయి. ఈ దీపావళి రోజు గంటపాటు సాగే మూరత్ ట్రేడింగ్ శనివారం సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభం కానుంది.

Tags:    

Similar News