Car Selling: కారు కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి..!

Car Selling: దేశంలో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్ నిరంతరం పెరుగుతోంది.

Update: 2022-06-01 07:30 GMT

Car Selling: కారు కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి..!

Car Selling: దేశంలో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్ నిరంతరం పెరుగుతోంది. ప్రజలు వీటిని విపరీతంగా అమ్మకాలు, కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా సెకండ్ హ్యాండ్‌ కారుని విక్రయించాలని లేదా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కారు RC బదిలీ ప్రక్రియని పూర్తి చేయండి. RC అనేది ఒక ముఖ్యమైన పత్రం. దీని ద్వారా వాహనం ఎవరి పేరుపై ఉందో తెలుస్తుంది.

ఆర్సీ బదిలీ చేయకుంటే చాలా నష్టం

మీరు కారును విక్రయిస్తున్నప్పుడు కారు RC బదిలీని పూర్తి చేయకుంటే తర్వాత పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. కారును విక్రయించిన తర్వాత RC బదిలీ చేయకుంటే మీరు దాని యజమానిగా కొనసాగుతారు. ఈ సందర్భంలో వాహనం ఏదైనా నేరంలో ఇరుక్కుంటే అప్పుడు కేసు మీ పైకి వస్తుంది. తర్వాత జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ప్రమాదాల విషయంలో కూడా మిమ్మల్ని పోలీసులు ప్రశ్నిస్తారు.

RC బదిలీ ఎలా చేయాలి?

మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ RC బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ RC బదిలీ కోసం RTO వెబ్‌సైట్‌ని సందర్శించి 'ఆన్‌లైన్ సర్వీస్'పై క్లిక్ చేయండి. ఆ తర్వాత RC Transfer, Duplicate RC లేదా Change Address ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత RC Transfer ఆప్షన్‌కి వెళ్లండి. ఆర్‌సి బదిలీ కోసం మీరు రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. అయితే ఈ ఎంపికలు వేర్వేరు RTOలలో భిన్నంగా ఉంటాయి. 

Tags:    

Similar News