Nominee Problems: నామినీ విషయంలో ఈ పొరపాట్లు చేయవద్దు.. భవిష్యత్‌లో అన్నీ తిప్పలే..!

Nominee Problems: మనం బ్యాంకులో అకౌంట్‌ తీసుకున్నా, లైఫ్‌ ఇన్సూరెన్స్‌, షేర్లు, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌, ఈపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, పీపీఎఫ్‌ ఎందులో పెట్టుబడి పెట్టినా కచ్చితంగా నామినీ పేరును మెన్షన్‌ చేయడం అవసరం.

Update: 2024-03-24 15:30 GMT

Nominee Problems: నామినీ విషయంలో ఈ పొరపాట్లు చేయవద్దు.. భవిష్యత్‌లో అన్నీ తిప్పలే..!

Nominee Problems: మనం బ్యాంకులో అకౌంట్‌ తీసుకున్నా, లైఫ్‌ ఇన్సూరెన్స్‌, షేర్లు, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌, ఈపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, పీపీఎఫ్‌ ఎందులో పెట్టుబడి పెట్టినా కచ్చితంగా నామినీ పేరును మెన్షన్‌ చేయడం అవసరం. లేదంటే భవిష్యత్‌లో క్లెయిమ్‌ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతమంది ఉద్యోగులు అన్నిట్లో పెట్టుబడులు పెడుతారు కానీ నామినీ విషయాన్ని ప్రస్తావించరు. మరికొంతమంది నామినీయే కదా ఎప్పుడైనా వివరాలు అందించవచ్చని వాయిదా వేస్తుంటారు. వీటివల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

నామినీగా ఒక్కరూ లేదా చాలామందిని మెన్షన్‌ చేయవచ్చు. కానీ ఇందులో ఎవరికి ఎంత అనేది స్పష్టంగా ఉండాలి. లేదంటే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. కొన్నిసార్లు ఈ విషయంలో కుటుంబ తగాదాలు, డబ్బుల కోసం గొడవలు కూడా జరుగుతాయి. అందుకే ఉన్న పెట్టుబడు లను గమనించి అందరికీ లాభం చేకూరేలా ముందుగానే నిర్ణయాలు తీసుకోవాలి. మరో విషయం ఏంటంటే బ్యాంకుల్లో డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు, ఇన్సూరెన్స్‌, ఇలా ఏది చేసినాసరే కుటుంబ సభ్యులకు వాటి గురించి చెప్పడం అవసరం. వాళ్లకు తెలియకపోతే మీరెన్ని పెట్టుబడులు పెట్టినా వృథానే అని మరువద్దు.

పెట్టుబడుల గురించి మీ కుటుంబ సభ్యులకు చెప్పకుంటే క్లెయిమ్‌ కోసం సక్సెషన్‌, లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్లు అవసరమవుతాయి. ఇందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక్కోసారి సమాచారమేదీ లేకపోతే ఇన్వెస్టర్‌ ప్రొటెక్షన్‌ ఫండ్‌కో, ఆర్బీఐ ఖాతాల్లోకో వెళ్లిపోయి మీ కష్టం బూడిదపాలవుతుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద రూ.35,012 కోట్ల అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లున్నాయంటే నామినీకున్న ప్రాధాన్యం మీరే అర్థం చేసుకోవచ్చు. అందుకే నామినీ పేరు తప్పక సూచించండి. ఆ పేరు రాసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బీమా సొమ్ముకు భార్య పేరును, షేర్లు, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌కు పిల్లల పేరు, మనపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఎఫ్‌డీలు అందేలా చర్యలు తీసుకోవడం ఉత్తమం అని చెప్పవచ్చు.

Tags:    

Similar News