Toll Tax Rules: ఆర్మీ సిబ్బందికి టోల్‌టాక్స్ వద్ద మినహాయింపు లభిస్తుందా.. నియమాలు తెలుసుకోండి..!
Toll Tax Rules: మనం హైవేపై కారులో వెళుతున్నప్పుడు టోల్ బూత్‌లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కచ్చితంగా టోల్ ట్యాక్స్ చెల్లించాలి. లేదంటే అది దాటి ముందుకు వెళ్లనివ్వరు.
Toll Tax Rules: ఆర్మీ సిబ్బందికి టోల్‌టాక్స్ వద్ద మినహాయింపు లభిస్తుందా.. నియమాలు తెలుసుకోండి..!
Toll Tax Rules: మనం హైవేపై కారులో వెళుతున్నప్పుడు టోల్ బూత్‌లు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కచ్చితంగా టోల్ ట్యాక్స్ చెల్లించాలి. లేదంటే అది దాటి ముందుకు వెళ్లనివ్వరు. ఇప్పుడు టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఉన్న కార్ల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఫాస్టాగ్ లేని కార్ డ్రైవర్ నుంచి జరిమానాగా రెట్టింపు పన్ను వసూలు చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కొంతమంది టోల్ బూత్ దగ్గర ఐడీ కార్డులు చూపించి టోల్ టాక్స్ మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఆర్మీసిబ్బంది ముందు వరుసలో ఉంటారు. దీనివల్ల వారి వెనుకున్న వాహనాల వారు తరచుగా ఇబ్బందిపడుతుంటారు. వాస్తవానికి ఆర్మీ సిబ్బందికి టోల్ ట్యాక్స్‌లో మినహాయింపు ఉంటుందా లేదా పూర్తిగా తెలుసుకుందాం.
ఫాస్టాగ్ తప్పనిసరి
నిజానికి ఫాస్టాగ్ వ్యవస్థ రాకముందు టోల్‌ప్లాజా వద్ద కారు ఆపి పన్ను వసూలు చేసేవారు. అప్పట్లో ఐడీ కార్డులు చూపించి వాదించుకుని టోల్ ట్యాక్స్ కట్టకుండా దాటేసే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ప్రతి కారుకు ఫాస్టాగ్ తప్పనిసరి. అది లేకుండా ప్రవేశిస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్మీ సిబ్బంది నియమాలు ఏంటి..?
ఆర్మీ సిబ్బంది డ్యూటీలో ఉన్నప్పుడు లేదా ప్రభుత్వ వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే టోల్ ప్లాజాల వద్ద మినహాయింపు పొందవచ్చు. ఒక సైనికుడు డ్యూటీలో లేకుంటే, తన ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్నట్లయితే అతను మినహాయింపు కిందకు రాడు. ఈ పరిస్థితిలో ఆర్మీ సిబ్బంది టోల్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ కూడా తప్పనిసరి. ఎన్‌హెచ్‌ఏఐ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. అంటే మునుపటిలా ఆర్మీ సిబ్బంది ఆర్మీ కార్డు చూపించి టోల్ ట్యాక్స్ దాటలేరు. వారు తమ వాహనంలో ఫాస్టాగ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఇతరుల మాదిరిగానే టోల్ చెల్లించాలి.