Indian Railways: రైల్వే టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. ప్రయాణికులకి ఈ పెద్ద ప్రయోజనం..!

Indian Railways: మీరు మీ కుటుంబ సభ్యులు తరచుగా రైలులో ప్రయాణిస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది.

Update: 2022-05-08 13:25 GMT

Indian Railways: రైల్వే టికెట్‌ బుకింగ్‌లో మార్పులు.. ప్రయాణికులకి ఈ పెద్ద ప్రయోజనం..!

Indian Railways: మీరు మీ కుటుంబ సభ్యులు తరచుగా రైలులో ప్రయాణిస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగపడుతుంది. వాస్తవానికి రైలు టిక్కెట్ల బుకింగ్ నిబంధనలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మార్చింది. IRCTC ఇప్పుడు టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి గొప్ప సౌకర్యాన్ని కల్పిస్తోంది. మీరు ఒక నెలలో మునుపటి కంటే ఎక్కువ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఇంతకు ముందు మీరు IRCTC ఖాతా నుంచి 6 టిక్కెట్ల వరకు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు మీ IRCTC ఖాతాతో ఆధార్‌ను లింక్ చేస్తే మీ కుటుంబ సభ్యులు దాని నుంచి ప్రయోజనాన్ని పొందుతారు. IRCTC ఖాతాతో ఆధార్‌ను లింక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు నెలలో 12 టిక్కెట్‌ల వరకు బుక్ చేసుకోవచ్చు. మీరు రైలులో తక్కువ ప్రయాణించినప్పటికీ మీరు మీ IRCTC ఖాతాను ఆధార్‌తో లింక్ చేయాలి. మీకు అవసరమైనప్పుడు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆధార్‌తో ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం..

IRCTC ఖాతాతో ఆధార్‌ని ఎలా లింక్ చేయాలి..?

1. ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్ irctc.co.inకి వెళ్లండి.

2. ఇక్కడ యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా లాగిన్ అవ్వండి.

3. హోమ్ పేజీలోని 'మై అకౌంట్‌'లో 'ఆధార్ KYC'పై క్లిక్ చేయండి.

4. ఇప్పుడు తర్వాతి పేజీలో ఆధార్ నంబర్‌ను నమోదు చేసి 'Send OTP'పై క్లిక్ చేయండి.

5. ఆధార్ కార్డుతో నమోదైన నంబర్‌కి OTP వస్తుంది. తర్వాత ధృవీకరించండి.

6. సంబంధిత సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత దిగువ రాసిన దానిపై 'వెరిఫై'పై క్లిక్ చేయండి.

7. అంతే IRCTC ఖాతాతో ఆధార్‌ లింక్‌ అవుతుంది. 

Tags:    

Similar News