Change Rules: న‌వంబ‌ర్ 1 నుంచి ఎల్పీజీ, రైల్వే, బ్యాంకు ఖాతాల నియ‌మాల‌లో మార్పు..!

Change Rules: నవంబర్ 1 నుంచి అనేక నిబంధనలు మారబోతున్నాయి. * రైళ్ల కొత్త టైమ్ టేబుల్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది.

Update: 2021-10-31 11:30 GMT
నవంబర్ 1 నుండి రైల్వే, బ్యాంకు, ఎల్పీజీ లో మార్పులు (ఫైల్ ఇమేజ్)

Change Rules: నవంబర్ 1 నుంచి అనేక నిబంధనలు మారబోతున్నాయి. ఈ నియమాలన్నీ మన దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఖ‌ర్చులు అధిక మ‌వుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలో మార్పు వచ్చినా, బ్యాంకుకు సంబంధించిన నిబంధనలలో మార్పు వచ్చినా అవి నేరుగా మన జీవితానికి సంబంధించినవే. కాబట్టి 1వ తేదీ రాకముందే మారిన ఈ నియమాలను తెలుసుకోండి. LPG డెలివరీ సిస్టమ్‌లో మార్పులు, డిపాజిట్లు , ఉపసంహరణలపై బ్యాంక్ నియమాలు, LPG ధరలు, రైల్వే టైమ్ టేబుల్‌లు ఉన్నాయి. ఇందులో మారిన నియ‌మాల గురించి తెలుసుకుందాం.

1.LPG డెలివరీ సిస్టమ్

నవంబర్ 1, 2021 నుంచి LPG గ్యాస్ సిలిండర్ల‌ నిబంధనలు మార‌బోతున్నాయి. గ్యాస్ ఏజెన్సీ విక్రేతల నుంచి ఇంటి వద్దకే ఎల్‌పిజి సిలిండర్‌ను డెలివరీ చేసుకున్న వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాలి. కొత్త రూల్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ ఓటీపీని గ్యాస్ వెండర్‌కు చెప్పాల్సి ఉంటుంది. ఈ కొత్త మార్పుకు డెలివరీ అథెంటికేషన్ కోడ్ (DAC) అని పేరు పెట్టారు. సిలిండర్‌ను సరైన వినియోగదారులకు అందజేయడంతోపాటు సిలిండర్‌ల బ్లాక్‌ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఈ నియ‌మం అమ‌లు చేస్తున్నారు.

2. రైల్వే టైమ్ టేబుల్

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైళ్ల వేళలను మార్చబోతోంది. రైళ్ల కొత్త టైమ్ టేబుల్ నవంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. ఒక నివేదిక ప్రకారం.. ప్యాసింజర్ రైళ్లతో పాటు, గూడ్స్ రైళ్ల‌కు కూడా కొత్త నియ‌మాలు వ‌ర్తిస్తాయి. అదేవిధంగా దేశంలో నడుస్తున్న దాదాపు 30 రాజధాని రైళ్ల వేళలను మార్చే అవకాశం ఉంది. కరోనా లాక్‌డౌన్ ముగిసిన తర్వాత రైల్వే తన రైళ్ల సంఖ్యను పెంచుతోంది కానీ ఇది ఇంకా సక్రమంగా జ‌ర‌గ‌డం లేదు. ప్రస్తుతం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతోంది.

3. LPG ధర

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌, గ్యాస్‌ ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో నవంబర్‌ 1న ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చమురు విక్రేతలు ప్రతి నెలా మొదటి తేదీన ఎల్‌పిజి ధరను సవరిస్తారు. అందువల్ల, నవంబర్ 1న LPG ధరలు పెరగవచ్చని వినియోగదారులు భావించాలి. అక్టోబర్ 6న ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.15 చొప్పున పెంచారు. దీంతో జులై నుంచి 14.2 కేజీల సిలిండర్ ధర మొత్తం రూ.90 పెర‌గిన సంగ‌తి తెలిసిందే..

4. నగదు డిపాజిట్‌, ఉప‌సంహరణలు

నవంబర్ 1 నుంచి బ్యాంకులో నగదు డిపాజిట్, నగదు ఉపసంహరణ నిబంధనలు మారనున్నాయి. ఈ నియమం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు సంబంధించిన‌ది. నిర్దిష్ట పరిమితి తర్వాత నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్‌పై ఛార్జీలను బ్యాంక్ మార్చబోతోంది. ఈ కొత్త నిబంధన పొదుపు, సాల‌రీ ఖాతాలకు వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, PNB, యాక్సిస్ బ్యాంక్‌, సెంట్రల్ బ్యాంక్ కూడా అతి త్వరలో ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి.

Tags:    

Similar News