Canara Bank: కెనరా బ్యాంకులో అకౌంట్‌ ఉందా.. తాజా మార్పు ఏంటో తెలుసుకోండి..!

Canara Bank: మీకు కెనరా బ్యాంకులో అకౌంట్‌ ఉందా.. అయితే ఇది మీకు శుభవార్తనే చెప్పొచ్చు.

Update: 2022-07-19 04:30 GMT

Canara Bank: కెనరా బ్యాంకులో అకౌంట్‌ ఉందా.. తాజా మార్పు ఏంటో తెలుసుకోండి..!

Canara Bank: మీకు కెనరా బ్యాంకులో అకౌంట్‌ ఉందా.. అయితే ఇది మీకు శుభవార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లని మార్చింది. 2 కోట్ల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న FDల వడ్డీ రేట్లు పెరిగాయి. కొత్త వడ్డీ రేట్లు 16 జూలై 2022 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంకులు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వినియోగదారులకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మీరు అవసరాన్ని బట్టి ఎంత కాలమైనా ఎఫ్డీ చేయవచ్చు.

బ్యాంకు సవరణ తర్వాత 7 రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 46 రోజుల నుంచి 90 రోజుల FDలపై 4 శాతం చొప్పున వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. 91 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డిలపై 4.05 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ఇది కాకుండా 180 రోజుల నుంచి 269 రోజుల FDలపై 4.50 శాతం వడ్డీ లభిస్తుంది.

270 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు FDలపై 4.55 శాతం, 333 రోజుల FDలపై 5.10 శాతం, 1 సంవత్సరం FDలపై 5.30 శాతం, 1 సంవత్సరం పైన లేదా 2 సంవత్సరాల కంటే తక్కువ FDలపై 5.40 శాతం, 2 సంవత్సరాల కంటే ఎక్కువ 3 సంవత్సరాల లోపు FDలపై 5.45 శాతం, 3 సంవత్సరాల కంటే ఎక్కువ 5 సంవత్సరాల కంటే తక్కువ FDలపై 5.70 శాతం, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు FDలపై 5.75 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.

Tags:    

Similar News