Home Loan: హోం లోన్ ఈఎంఐలు చెల్లించకుండా ఉండొచ్చా..?

Home Loan: హోంలోన్ ఈఎంఐ చెల్లించకపోతే ఏం జరుగుతుంది? ఎన్ని నెలల పాటు ఈఎంఐ చెల్లించకుండా ఉండొచ్చు?

Update: 2025-01-25 07:20 GMT

Home Loan: హొంలోన్‌ ఈఎంఐలు చెల్లించకుండా ఉండొచ్చు..?

Home Loan: హోం లోన్ ఈఎంఐ చెల్లించకపోతే ఏం జరుగుతుంది? ఎన్ని నెలల పాటు ఈఎంఐ చెల్లించకుండా ఉండొచ్చు? రుణం తీసుకున్న ఇంటిని బ్యాంకులు వేలం వేస్తాయా? ఇతర పరిణామాలు ఎదురౌతాయా? అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

ఇంటి కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం చాలా మంది హౌసింగ్ రుణం తీసుకుంటారు. అయితే ఈ రుణాన్ని ప్రతి నెల ఈఎంఐ రూపంలో రుణగ్రహీత చెల్లిస్తారు. అయితే ఆర్ధిక ఇబ్బందులతో ఈఎంఐ సకాలంలో చెల్లించలేని పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలనే ఆర్ధిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే ఫైన్ కట్టాలి. ఈఎంఐ ఆధారంగా వడ్డీ కట్టాలి. ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే వడ్డీ పెరిగిపోతుంది. రెండు కంటే ఎక్కువ ఈఎంఐలు చెల్లించకపోతే రుణాన్ని డిఫాల్ట్ గా ప్రకటించే ప్రమాదం ఉంది. ఇది ఆ ఇంటిని జప్తు చేసేందుకు ఛాన్స్ ఇస్తోంది. రుణం తీసుకున్న ఇంటిని విక్రయించి రుణాన్ని రాబట్టుకొంటుంది బ్యాంక్.

ఈఎంఐ చెల్లించకపోతే సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతోంది. ఇది భవిష్యత్తులో రుణాలు తీసుకోవడానికి అవరోధంగా మారనుంది. ఒక్క ఈఎంఐ చెల్లించకపోయినా క్రెడిట్ రిపోర్టులో అది కన్పిస్తోంది. తద్వారా క్రెడిట్ స్కోర్ 50-70 పాయింట్లు తగ్గే అవకాశం ఉంది.ఈఎంఐ చెల్లింపునకు సంబంధించి ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే దానికి కూడా ఫైన్ చెల్లించాలి. అయితే బ్యాంక్ ను బట్టి ఈ ఫైన్ ఉంటుంది.

ప్రైవేట్ ఉద్యోగులు లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా ఈఎంఐ చెల్లింపులో వస్తే ఆ విషయాన్ని సంబంధిత బ్యాంకు మేనేజర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఈఎంఐ చెల్లింపునకు సమయం ఇవ్వాలని కోరాలి. నెల, రెండు నెలలు, ఆరు నెలలు ఎంత సమయం కావాలో బ్యాంకుకు స్పష్టంగా వివరించాలి. రుణ గ్రహీత ట్రాక్ రికార్డ్ ఆధారంగా బ్యాంకులు రుణగ్రహీతకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

వరుసగా మూడు ఈఎంఐలు చెల్లించకపోతే తాకట్టు పెట్టిన ఇంటిని నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్ పరిగణిస్తారు.60 రోజుల్లో గడువులోపుగా బకాయిని చెల్లించకపోతే ఇంటిని లేదా ఆ ఆస్తిని బ్యాంకులు వేలం వేస్తాయి. వేలంలో రుణం కంటే ఎక్కువ డబ్బులు వస్తే దాన్ని రుణం తీసుకున్నవారికి ఇస్తారు.

Tags:    

Similar News