కొంపలు కూల్చిన కరోనా..కుప్ప కూలిన షేర్ మార్కెట్లు!

చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అలాగే దేశియ మార్కెట్లు కూడా జారుడు బండలా తయారైయ్యాయి.

Update: 2020-03-12 12:46 GMT
A broker reacts while trading at his computer terminal at a stock brokerage firm in Mumbai (pic: Reuters)

చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అలాగే దేశియ మార్కెట్లు కూడా జారుడు బండలా తయారైయ్యాయి. దాదాపు 52 వారాల కనిష్టానికి అన్ని హెవీ వెయిట్‌ షేర్లు పడి పోయాయంటే, అర్థం చేసుకోవచ్చు పతనం ఏ స్థాయిలో వుందో.

సెన్సెక్స్‌ ఇంట్రాడేలో ఏకంగా 3200 పాయింట్లకు పైగా నష్టపోయాగా, నిప్టీ 868 పాయింట్లు పతనమైంది. ఆఖరి గంటలో కాస్త పుంజుకుని సెన్సెక్స్‌ 2919 పాయింట్ల నష్టంతో.. 32,778 వద్ద రెండేళ్ల కనిష్టానికి చేరింది. నిఫ్టీ 32 నెలల కనిష్టానికి చేరి 868 పాయింట్లు పతనమై 9,590 వద్ద నిలిచింది. మొత్తంగా స్టాక్‌మార్కెట్లో ఇదే అతిపెద్ద పతనం. యెస్‌ బ్యాంక్‌లు, బీపీసీఎల్‌ 15శాతం పైగా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, అదాని పోర్ట్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, గెయిల్ ఇండియా, హిందాల్కో , ఒఎన్‌జిసి, 15 శాతం క్షీణించాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను భయంకరమైన మహమ్మారిగా ప్రకటించడంతో.. ఇన్వెస్టర్లు కూడా షేర్ల అమ్మకాలవైపు మొగ్గుచూపారు. దీంతో, ఇప్పటికే కుదేలైన మార్కెట్లు ఇవాళ ఒక్కరోజే మరోభారీ పతనానికి చేరాయి.

 

Tags:    

Similar News