Bajaj Finance Airtel partnership: జట్టు కట్టిన బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్‌టెల్.. త్వరలో కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం

Bajaj Finance Airtel partnership: భారతీ ఎయిర్‌టెల్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) బజాజ్ ఫైనాన్స్ మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది.

Update: 2025-01-21 05:45 GMT

Bajaj Finance Airtel partnership: జట్టు కట్టిన బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్‌టెల్.. త్వరలో కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం

Bajaj Finance Airtel partnership: భారతీ ఎయిర్‌టెల్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) బజాజ్ ఫైనాన్స్ మధ్య ఒక కీలక ఒప్పందం జరిగింది. ఆర్థిక సేవల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి రెండు కంపెనీలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం 37.5 కోట్ల మంది ఎయిర్‌టెల్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.


ఇందులో బజాజ్ ఫైనాన్స్ విభిన్న పోర్ట్‌ఫోలియో, 12 లక్షలకు పైగా కస్టమర్ల పంపిణీ నెట్‌వర్క్, 5,000 కంటే ఎక్కువ శాఖలు, 70,000మంది ఫీల్డ్ ఏజెంట్ల నెట్‌వర్క్‌తో కూడిన 12 ఉత్పత్తి లైన్లు ఉన్నాయి. అంటే, మొత్తం కస్టమర్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని ఫైనాన్స్ సంబంధిత సేవలను పొందుతారు.

ఈ రెండు పెద్ద కంపెనీలు కలిసి ఆర్థిక సేవలు అందుబాటులో ఉండే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సృష్టిస్తాయి. ఇది ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌తో ప్రారంభమవుతుంది. దీని ద్వారా బజాజ్ ఫైనాన్షియల్ రిటైల్ ఉత్పత్తులు అందించబడతాయి. "ఎయిర్‌టెల్‌తో ఈ భాగస్వామ్యం భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా, ఈ ఒప్పందం దేశంలోని రెండు అతిపెద్ద , అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌ల సేవలను విస్తరించడానికి కూడా దోహదపడుతుంది" అని బజాజ్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి నాటికి బజాజ్ ఫైనాన్స్ నాలుగు ఉత్పత్తులు ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు.


భారతీ ఎయిర్‌టెల్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. "మా కస్టమర్లలో కోటి మందికి పైగా మాపై నమ్మకం ఉంచారు. ఎయిర్‌టెల్ ఫైనాన్స్‌ను ఆర్థిక సేవలకు ఒక చోట అందించేలా చేయడమే మా లక్ష్యం.’’ అన్నారు. NBFC కంపెనీ బజాజ్ ఫైనాన్స్ వినియోగ వస్తువులు, వాహన ఫైనాన్స్ కోసం రుణాలను అందిస్తుంది. బజాజ్ గ్రూప్ ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడింది.

Tags:    

Similar News