Stock Market: భారత స్టాక్ మార్కెట్‌లపై బేర్ పంజా.. 1360 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
Stock Market: 380 పాయింట్ల నష్టంలో నిఫ్టీ
Stock Market: భారత స్టాక్ మార్కెట్‌లపై బేర్ పంజా.. 1360 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, దేశీయంగా కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీలను కిందకు లాగుతున్నాయి. మధ్యాహ్నం రెండు గంట సమయంలో సెన్సెక్స్ 1,360 పాయింట్లు నష్టపోయి 71వేల 768 వద్ద కొనసాగుతోంది. నిప్టీ 380 పాయింట్లు కుంగి 21వేల 652 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్-30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటన్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేదు. దీంతో ఈ బ్యాంకు షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇంట్రాడేలో షేరు ఏడు శాతానికి పైగా నష్టపోయింది.